11, జూన్ 2016, శనివారం

జై బజరంగభళి

జయ జయ హనుమా! జయ జయ హనుమా.
వానర దూతా వాయుకుమారా !
 అతి బలవంతా ! అంజని పుత్రా!
జయ జయ హనుమా !   జయ జయ హనుమా ! !

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుబాకాంక్షలు

జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం
 స్థితప్రజ్నాత అలవరుచుకోవడం వీవేకుల లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం..
మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని మనశ్పూర్తిగా కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు..

27, నవంబర్ 2015, శుక్రవారం

తెలుగు తల్లి


మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతి గ్రుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
      
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.

2, అక్టోబర్ 2015, శుక్రవారం

కోనసీమ...ఆ పేరు వినగానే పచ్చతనం గుర్తుకు వస్తుంది

కోనసీమ...ఆ పేరు వినగానే పచ్చతనం గుర్తుకు వస్తుంది. ఠీవీగా తలెత్తుకుని ఆకాశాన్ని సవాలు చేసే కొబ్బరి చెట్లూ, పచ్చని చీర గట్టి వయ్యారాలు పోయే ప్రకృతి కాంతలా చిరుగాలికి తలలూపే పచ్చని పైర్లూ, పదహారేళ్ళ పడుచు పిల్లలా గలగల మంటూ గెంతులు వేస్తూ కవ్విస్తూ తుళ్ళిపడుతూ సాగిపోయే నదులూ, కాలువలూ, పెద్ద ముత్తైదువులాగా గుంభనంగా ఉండే మామిడి తోటలూ, ఇంక పిల్ల కాయలు కోతి కొమ్మచ్చులు ఆడుకోవటానికే పుట్టినట్లుండే సపోటాలూ, గంపెడు పిల్లలతో నిండుగా నవ్వే తల్లిలాంటి అరటి చెట్లూ, మీకు దాహం వేస్తే తినటానికి ముంజెలు, ఆకలేస్తే తినటానికి తేగలూ, మూడొస్తే తాగటానికి కల్లు, ఎండకీ వానకీ తడవకుండా ఇంటికి పైకప్పు, ఎండాకాలం ఇస్సో ఉస్సో మనుకుంటూ విసురుకోవటానికి విసనకర్రలూ అన్నీ మా సొత్తే కదా అంటూ పలకరించే తాడి చెట్లూ ఇవన్నీ అందాల కోనసీమ సొంతం.

10, ఆగస్టు 2015, సోమవారం

1960 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మనకోసం..


వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది
మనదే చివరి తరం.
పోలీస్ వాళ్ళని
నిక్కర్లలో చూసిన
తరమూ మనదే.
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని
కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే
చాలా దూరం అయితే
సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం.
కార్టూన్స్ ని రంగులలో చూడటం.
అమ్యూజ్ మెంట్ పార్కులకి
వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్
చేసినవాళ్ళం.
అలాగే
వాక్ మ్యాన్ తగిలించుకొని
పాటలు వినేవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని
వాడిన తరం మనదే..
అలాగే
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన
తరం కూడా మనదే.
అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..
సైకిల్లకి బ్రేకులు లేకుండా
రోడ్డు మీద ప్రయాణించిన
ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.
స్కూల్ కి
కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా,
జుట్టు కూడా దువ్వుకోకుండా
మామూలు బట్టలతో వెళ్ళాం
ఇప్పటి తరం
అలా ఎన్నడూ వెళ్ళలేదు
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
స్నేహితుల మధ్య
" కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరూ
ఆస్తులు, అంతస్థులు చూడకుండా
స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,
చెరువు గట్ల వెంట,
కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.
జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల
కుప్పలు ఆడిన తరము మనదే.
శుక్రవారం సాయంత్రం
" చిత్రల హరి" కోసం
ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
ఆదివారం ఉదయం
9 కి పనులు
తప్పించుకుని
"మహాభారతము"
" రామాయణం"
" శ్రీకృష్ణ" చూసిన
తరమూ మనదే...
ఉషశ్రీ గారి
భారత రామాయణ ఇతిహాసాలు
రేడియోలో విన్నది మనమే,
అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా
చూసుకున్న ఘనతా మనదే ..
ఆదివారం ఒక గంట
అద్దె సైకిల్ కోసం
రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
పలకలని వాడిన
ఆఖరు తరం కూడా మనదే.
రుపయికు
థియేటర్ లో సినిమా చూడడానికి
రెండు కిలోమీటర్ లు
నడిచిన కాలం..
గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన
కాలం..
మనమే.. మనమే
అమ్మ 5 పైసలు ఇస్తే
బఠానీలు తిన్నదీ మనమే..
గోర్లపైన కొంగ గోరు గుర్తులు
చువ్వాట..
సిర్రగోనే ఆట..
కోతి కొమ్మ...
అష్ట చెమ్మ...
ఆడిన
తరము మనదే.
క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,
కనీసం 20 ఫోన్
నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ,
ఫ్లాట్ స్క్రీన్స్,
సరౌండ్ సౌండ్స్,
MP3, ఐ ప్యాడ్స్,
కంప్యూటర్స్,
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్...
లేకున్నా
అంతులేని ఆనందాన్ని పొందాం.
మన పిల్లలకు అవి తెలియదు
మన పెద్దలకు ఇవి తెలియదు
కానీ
మనం అవి ఇవి చూశాం
ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.

8, ఆగస్టు 2015, శనివారం

తేట తేట తెనుగులా....తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు అన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చుడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు 🙏

పొగడరా నీ తల్లి భూమి భారతిని

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
 ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిని
 పొగడరా నీ తల్లి భూమి భారతిని
 నిలుపరా నీ జాతి నిండు గౌరవము
 ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగబలమో
 జనియించినాడ ఏ స్వర్గఖండమున
 ఏమంచి పూవులన్ ప్రేమించినావో
 నిను మోసే ఈ తల్లి కనక గర్భమున
 లేదురా ఇటువంటి భూదేవి యెందు
 లేరురా మనవంటి పౌరులింకెందు
 సూర్యుని వెలుతురుల్ సోకునందాక
 ఓడల జెండాలు ఆడునందాక.
అందాకగల ఈ అనంత భూతలిని
 మన భూమి వంటి చల్లని తల్లి లేదు
 పాడరా నీ తెలుగు బాలగీతములు
 పాడరా నీ వీర భావ భారతము.
తమ తపస్సులు ఋషులు ధారవోయంగ
 శౌర్యహారము రాజచంద్రులర్పింప
 భావ సూత్రము కవిప్రభువు లల్ల్లంగ
 రా దుగ్ధము భక్తరత్నముల్ పిదుక.
దిక్కుల కెగదన్ను తేజమ్మువెలుగ
 రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
 జగముల నూగించు మగతనం బెగయ
 సౌందర్యమెగ బోయు సాహిత్యమలర
 వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర
 దీవించె నీ పుణ్యదేశంబు పుత్ర
 పొలముల రత్నాలు మొలిచెరా యిచట
 వార్ధిలో ముత్యాలు పండేరా యిచట.
పృధివి దివ్యౌషధుల్ పిదికెరా మనకు
 కానల కస్తూరి కాచెరా మనకు
 అవమానమేలరా? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ.