10, ఫిబ్రవరి 2015, మంగళవారం

కుంకుమ ధారణ

            

            ప్రపంచంలో సుమంగళి అయిన ఏ హిందూ మహిళ కూడ నుదుట కుంకుమ లేకుండా కనిపించదు. కుంకుమ బొట్టు సౌభగ్యానికి, సుమంగళిత్వానికి చిహ్నం! సువాసినులను లక్ష్మీ సౌభాగ్యవతులుగా చెబుతారు. సుమంగళి అయిన మహిళ పొరపాటున నుదుట కుంకుమ చెరిగితే వెంటనే సరిచేసు కోవడం తక్షణ కర్తవ్యంగా భావిస్తుంది. హైందవుల్లో స్త్రీ పురుష భేదం లేకుండా కుంకుమ ధరించడం ఆనవాయితీ. కుంకుమ నుదుట రెండు కనుబొమల మధ్య ధరిస్తారు. ఆ స్థానంలో ఆజ్ఞాచక్రం వుంటుంది. ఆజ్ఞా చక్రస్థానంలో శ్రీలలిత ఉపస్థితమై వుంటుందని అమ్మవారి సహస్రనామావళి ప్రవచిస్తోంది.

           కుంకుమ ధారణ వలన ఆజ్ఞాచక్రం జాగృతమౌతుంది. నుదుట కుంకుమ లేని వ్యక్తి శిరస్సుపై శనీశ్వరుడు నాట్యం చేస్తాడని పెద్దలు చెబుతారు. కుంకుమ, సాంప్రదాయాన్ని ప్రతిబింబి స్తుందనే కాక స్త్రీలకు ముఖ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. రెండు కను బొమల మధ్య గల ఆజ్ఞాచక్రం పై కుంకుమ ధరించడం వలన నాడీ వ్యవస్థకు అనుకూల తరంగాల ప్రసరణ జరుగుతుంది. తద్వారా నరాలు ఉత్తేజితమై ఏదయినా ప్రతికూలత ఆశ్రయించి గనుక వుంటే అది తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందనే భావంతో ప్రాచీన ఋషులు కట్టు-బొట్టుతో కూడిన సాంప్రదాయాన్ని లక్ష్యించి వుంటారన్నది సుస్ఫష్టం!


            నుదుట కుంకుమ నరదృష్టి దోషాన్ని నివారించే ప్రక్రియలో భాగస్వామి అవుతుందన్నది మరో కోణం. నాగరికత పరిణామం చెందుతున్న తరుణంలో స్త్రీలు ఎర్రని కుంకుమ ధరించడం సాంప్రదాయమయినప్పటికీ, ధరించిన వస్త్రాలకు అనుగుణంగా వివిధ వర్ణాల కుంకుమ ధరిస్తున్నారు. రక్త వర్ణంలోని బొట్టు, సాంప్రదాయం ప్రతిబింబించడంతో పాటు త్యాగగుణాన్ని ఆవిష్కరిస్తుంది. ఎర్రని కుంకుమ రక్తానికి సంకేతం. ఎర్రని కుంకుమతో అమ్మవారికి పూజ చేయడం, స్వీయ రుధిరంతో పూజించిన త్యాగఫలాన్ని అనువర్తింపజేస్తుందని ఓ అభిప్రాయం.
ధ్యాన యోగ నిష్ఠలో కుండలిని శక్తి జాగృతమవుతుందని, కుండలిని నుంచి వెలువడిన శక్తి తరంగాలు ఊర్థ్వముఖంగా పయనించి ఆజ్ఞాచక్రం ద్వారా బయటికి వెడలిపోతాయనీ, కుంకుమ ధారణ వలన కుండలినీ శక్తి వృధాగా పోకుండ ఆత్మలబ్ధికోసం వితరణ అవుతుందని చెబుతారు. అంతే కాకుండ ధ్యాన మగ్నమయివున్న మనస్సు అచలితంగా నిలిచి ధ్యేయంపై కేంద్రీకృత మవుతుంది. ధ్యానంలో ఏకాగ్రత కుదిరినపుడు దరిచేరిన మనోసంబంధ శారీరక రుగ్మతలన్నీ నియంత్రిత మవు తాయన్నది వైద్య శాస్త్రం ధృవీకరించిన అంశం.

            కుంకుమ ధారణ ప్రశస్తమయిన ఆచా రం. ఇప్పుడు విస్తారంగా ప్రచా రంలో వున్న స్టిక్కర్లు ధరించడం వలన కొంత సౌలభ్యం, సౌకర్యం వుండవచ్చునేమోగాని స్వచ్ఛమయిన ఎర్రని కుంకుమ లో పసుపు కలిసి వుండటం వలన స్త్రీలకు మంగళ ప్రదం కాగలదని విశ్వసించివచ్చు. స్టిక్కర్లు వివిధ వర్ణాల్లో, ఆకృతుల్లో లభిస్తూ యువతులను ఆకర్షిస్తున్నప్పటికీ వాటిని ధరించడం వల్ల అవి కుంకుమకు ప్రత్యామ్నాయం కాబోవు. స్కిక్కర్లకు జిగురు వుండటం వలన అవిధరించిన ప్రాంతంలో చర్మానికి హాని జరిగే అవకాశం ఉంది.
       ఇదిలా వుంటే, పురుషులు ఏదేని దీక్షలో వున్న సమయంలో కుంకుమ విభూతి నొసట ధరించి దీక్ష కొనసాగిస్తూ వుంటారు. దీక్ష పూర్తయిన తరువాత చాల మంది బొట్టు విస్మరిస్తారు. దీక్షా సమయంలో లేని అసౌకర్యం దీక్ష పూర్తయ్యాక కలగటం విచిత్రం. ఆధునిక వేష భాషలతో బొట్టు మమేకం కాబోదని ఒక భావన వుండటం ఉల్లేఖనీయం. సూటు-బూటులో కూడ కొందరు బొట్టు ధరించడం చూస్తుంటాం. వారు ఏ కంపెనీకో సి.ఇ.వో. అయితే హర్షిస్తా! సాధారణ ప్రజగా బొట్టు హోదాకు భంగం కలిగి స్తుందేమో అనే అభిప్రాయం కొందరిలో వుంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణు డు స్వధర్మం ఆచరిం చాలనే, అదే అభిలష ణీయ మనీ చెప్పాడు. స్వధర్మాచరణలో సిగ్గుపడే అవకాశం వుండ కూడదు. హుందాతనం తమ ప్రవర్తనలో, వివేచ నలో, మాటలో, హోదాలో, మంచి తనంలో వుంటుంది. హుందాతనాన్ని బొట్టు తక్కువ చేయ దని విశ్వసించిన పుడు కుంకుమ ధారణ ఆదరణ పొందు తుంది. బొట్టు వలన ఆజ్ఞాచక్రం జాగృతమవుతుందనీ, దానివలన మనిషి తనపై తాను నియంత్రణ పొంది పట్టు సాధించుకోగలుగుతాడనీ, ఎదుటి వారిని కూడ ఆకర్షించగలు గుతాడనీ యోగశాస్త్రం వచిస్తోంది.
        ఏనాటివాడో అయిన చాణుక్యుని మానేజ్‌మెంట్‌ సిద్ధాంతాలు నేటి ఆధునిక వ్యాపార సువ్యవస్థకు ఊపిరులూదు తున్నాయనీ, ఋషి ప్రోక్తమయిన ఏ సాంప్రదాయంలో కూడ స్వహితము ఇమిడి వున్నాయని ఏ సాంప్రదాయంలో కూడ స్వహితం, సమాజ హితము ఇమిడి వున్నాయని విశ్వసించి నపుడు సర్వ ప్రయోజనాలు సిద్ధిస్తాయి.