10, ఫిబ్రవరి 2015, మంగళవారం

నుదిటిపై తిలకం ధరించడం అవసరమా?       శరీరంలోని ఐదవ లేదా ఆరవ శక్తి కేంద్రమైన భృకుటి ప్రాంతంలో మనం బొట్టు పెట్టుకుంటాం. ముక్కు దూలానికి పైన, రెందు కనుబొమ్మల మధ్య శక్తి కేంద్రమున్నది. మానసిక వైద్యుడు చికిత్స చేస్తున్నప్పుడు  తన దృష్టీని ఈ కేంద్రం పైనే లగ్నం చేసి సమ్మోహన పరచుతాడు. భృకిటిలో కుంకుమను ధరించడం వల్ల అది సూర్యకిరణాలలొని ఔషదీయ తత్వసారాన్ని గ్రహించి మెదడుకు సరఫరా చేస్తుంది.

      భృకుటి ప్రాంతంలో గంధలేపనము, కుంకుమ మరియు విభూతిని ప్రాంతకాలములో మరియు సాయంకాలవేళ ధరించడం ద్వారా ఎన్నో రుగ్మతలు తొలగిపోయి నాడీవ్యవస్థ జాగృతమై ఉంటుందని, సూర్యకిరణాలకు మరియు మన శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని  అధ్యాయమను చేయడం ద్వారా తెలిసింది.
గంధలేపనన్ని మరియు విభూదిని ధరించడంలో కొన్ని పద్దతులున్నాయి. ఉదయం వేళ విభూదిని తడిపి పెట్టుకోవాలి . అలాగే మధ్యాహ్నం వేళ కాస్త గంధాన్ని కలిపి విభూదిని పెట్టుకోవాలి. స్త్రీలు మాత్రం పొడి విభూదిని మాత్రమే ధరించాలనేది నియమం.