10, ఫిబ్రవరి 2015, మంగళవారం

నుదుట‌న కుంకుమ బొట్టు పెట్టుకొంటాం మ‌న సాంప్ర‌దాయం


   
తెలిసిన విష‌యాలు చాలా ఉంటాయి కానీ అందులోని అంత‌రార్థం తెలుసుకొంటే మాత్రం వివ‌ర‌ణ పూర్తిగా తెలుస్తుంది

     
 నుదుట‌న కుంకుమ బొట్టు పెట్టుకొంటాం మ‌న సాంప్ర‌దాయం. దీనికి బ‌దులు ఇప్పుడు స్టిక్క‌ర్ లు పెట్టుకోవ‌టం అలవాటైంది. దీని మీద వ్యాఖ్యానించ‌ద‌ల‌చుకోలేదు. కానీ నుదుట‌న కుంకుమ పెట్టుకోవ‌టం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. నుదిటి ప్రాంతంలో నాడీ వ్య‌వ‌స్థ కు చెందిన కీల‌క నాడుల‌న్నీ ఒకే చోట పోగు ప‌డి ఉంటాయి. ఇక్క‌డ నుంచే మెద‌డుకు వెళ్లే నాడులు సాగుతుంటాయి. ఇక్క‌డ ఉండే ర‌క్త నాళాల్లో చురుగ్గా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతు ఉంటుంది. ఆ ఉధృతికి త‌గిన‌ట్లుగానే ఇక్క‌డ ఒత్తిడి ఉంటుంది. అందుచేత అక్క‌డ చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చే విధంగా బొట్టు పెట్టుకొంటే మంచిది. ఇందుకోసం పూర్వ కాలంలో అర‌టి బొట్టు పెట్టుకొనేవారు. అర‌టి బొట్టు అంటే అర‌టి చెట్టు ని కూల్చిన‌ప్పుడు కొంత మేర న‌ల్ల‌గా ఏర్ప‌డుతుంది. ఆ కాండ‌ము ను క‌త్తిరించి ఆర పెట్టిన‌ప్పుడు ఇది ఏర్ప‌డుతుంది. దీన్ని సేక‌రించి బొట్టుగా పెట్టుకొనే సాంప్ర‌దాయం ఉంది. కొన్ని చోట్ల మారేడు ద‌ళాలు ఎండ పెట్టి కాల్చి దీన్ని బొట్టుగా ధ‌రిస్తారు. క‌నీసం ప‌సుపు నుంచి త‌యారు చేసిన కుంకుమ ను బొట్టుగా పెట్టుకొన్నా చాలా మంచిదే. అందుచేత ఏ రూపంలోని బొట్టుని అయినా ధ‌రించ‌టం వ‌ల‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అంతే కాకుండా ముఖ వ‌ర్చస్సు కూడా నిండుగా ఉంటుంది. ఆడ‌వారు మాత్ర‌మే కాదు మ‌గ వారు కూడా చ‌క్క‌గా బొట్టు పెట్టుకొంటే ఆరోగ్య వంతంగా సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండ‌టానికి వీల‌వుతుంది. ఆలోచించి చూడండి..!