10, ఫిబ్రవరి 2015, మంగళవారం

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

                                                 

రిపబ్లిక్ డే అంటే ఏమిటి?? స్వాతంత్ర్య దినానికి రిపబ్లిక్ డే కు మధ్యగల భేదం ఏమిటి??
ముందస్తు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!

ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినమును స్వాతంత్ర్య దినం అంటారు.. మన దేశానికి ఆగష్టు 15 న స్వాతంత్రము వచ్చినది. 
స్వాతంత్ర్యం రాగానే వెంటనే ఒక రాజ్యం పాలనలోకి రాలేదు దానికి కొన్ని కట్టు బాట్లు నడవడికలు ఏర్పరచుకోవాలి... ఆతర్వాతే పాలన ప్రారంభిస్తుంది.. దానినే రాజ్యాంగం అంటారు.. ఇలా మన దేశ రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని 26 జనవరి 1950నుండి అమలులోకి వచ్చింది.. అందుకే అప్పటినుండి సర్వసత్తాక స్వతంత్ర్య భారత్ అయిందన్న మాట... అయితే 1949 నవంబరు 26 కే రాజ్యాంగ రచన పూర్తయింది కానీ 26 జనవరి వరకు ఎందుకు ఆగారంటే... 26 జనవరి 1930 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు .. ఆరోజునుండే స్వాంతంత్ర్యకాంక్ష ఎక్కువవుతూ చివరికి స్వాతంత్ర్యం ఇచ్చేంత వరకు కొనసాగిందన్న మాట.. అందుకే మనకు 26 జనవరి అత్యంత ప్రాముఖ్యమైన రోజు...
ప్రతి సంవత్సరం జాతీయ సెలవుదినాలుగా ప్రకటించే మూడు పండుగలలో ఇది మొదటిది(క్యాలెండర్ ప్రకారం) మిగిలిన రెండు ఆగస్టు15 మరియు అక్టోబర్ 2. రాజ్యాంగం ప్రకారమే దేశంలోని చాలా వ్యవస్థలు నడుస్తాయి..
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్ట్ ప్రధానన్యాయమూర్తి, యంఎల్ ఏ, యంపి, లాంటి ముఖ్యులంతా ఈ రాజ్యాంగం ప్రకారం నడచుకోవలసినదే...
ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో మన రాజ్యాంగం మించినది లేదు.. చివరికి ఫ్రాన్స్ అమెరికా రాజ్యాంగాలు కూడా మనకంటే దిగదుడుపే...
మన రాజ్యాంగంలోని డివిజన్ లను షెడ్యూల్స్ అంటారు.. రాజ్యాంగాన్ని రూపొందించే టపుడు అవి మొత్తం 8 ఉండేవి.. ఆతర్వాత ఒక్కొక్కటిగా పన్నెండవ షెడ్యూల్ వరకు జతచేయబడ్డాయి...
రాజ్యాంగంలో సవరణ చేయాలంటే ఆషామాషీ విషయం కాదు.. దీనికై పార్లమెంటు ఉభయసభల్లోను సవరణ బిల్లు ఆమోదం పొందాలి.
సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యత, మరియు మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యత తో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే ప్రత్యేకించిన కొన్ని అధికరణాలు, షెడ్యూళ్ళకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా ఆమోదించాలి. పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తరువాత, సంతకం అయిన తేదీ నుండి సవరణ అమలు లోకి వస్తుంది. ఒక సవరణలో ఇన్ని గొడవలుంటాయి.. కానీ 2012 ఏప్రిల్ వరకు రాజ్యాంగానికి 97 సవరణలు జరిగాయి. ఇన్ని సవరణలు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలోనూ లేదు...అవతారికలోను, సవరణ విధానంలోను కూడా సవరణలు(అంటే రాజ్యాంగాన్ని ఎలా సవరించాలి అనేదానిలో కూడా సవరణ జరిగిందన్నమాట) జరిగాయి. అంత స్వతంత్ర్యం ఉంది మన రాజ్యాంగంలో..(ఒక విధంగా అది కూడా లోపమే కానీ నెగటివ్ గా చూడకూడదు) ఇన్ని ప్రత్యేకతలు మన రాజ్యాంగానికి ఉన్నాయి కాబట్టి.. మన దేశం .... స్వతంత్ర భారత దేశం ... సర్వసత్తాక, అతి పెద్ద ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించగలిగింది...
మనం ఇంత స్వతంత్రంగా జీవించగలగుతున్నందుకు భారతీయులమైనందుకు తప్పని సరిగా గర్వపడాలి!!

భారత్ మాతాకీ జై!!