27, మే 2015, బుధవారం

భగవద్గీత-ప్రపంచమంతా గౌరవించే గ్రంధం


చిన్నవయసులోనే భగవద్గీత చదివితే మన జీవితం సుఖమయమవుతుంది,
 భగవద్గీత-ప్రపంచమంతా గౌరవించే గ్రంధం.గీత అంటే మాట,వాక్కు.భగవంతుని వాక్కులే భగవద్గీత.ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత.అందుకే అంటారు,సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా,ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి,ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే,మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం.


కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని,అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్ధములకు అద్దం వంటిది.దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు.
భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము.అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నడని,ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు.నిజమే ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు.ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి.మనం వ్యక్తిని ద్వేషించడం కాదు,చెడు లక్షణాలను,చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.
మనం లోకంలో చూస్తే ఎవరైన చనిపోతే భగవద్గీత పెడతారు."ఆత్మశాంతి"కోసం పెట్టామంటారు.చేయాల్సినవన్ని చేసేశాక,జరగవలసినవన్ని జరిగిపోయాక,ఎంతో పుణ్యం చేస్తే కాని దొరకని మానవ జన్మ,మానవ శారీరం పోయాక అప్పుడు వింటే ఏం లాభం?బ్రతికున్నప్పుడే చదవాలి భగవద్గీత.తత్వం బోధపడాలి.అప్పుడే జన్మ చరితార్ధం అవుతుంది.మీకో విషయం తెలుసా?మన జీవితం మనమే రాసుకుంటాము.12 నుండి 40 సంవత్సరముల మధ్య మనం ఏ ఏ కర్మలు(పనులు)చేస్తామో,అవి ఆ తరువాతి జీవితాన్ని నడిపిస్తాయి.ఈ 28 సంవత్సరముల కాలంలో మనిషికి ఎటువంటి కర్మలైన(అవి మంచివో,చెడ్డవో) చేసuే అధికారముంది.ఆ తరువాత ఈ కర్మలను బట్టే మన జీవితం నడుస్తుంది.ఈ విషయాని జ్యోతిష్యం కూడా ఒప్పుకుంది.చిన్నవయసులోనే భగవద్గీత చదివితే మనం జీవితం సుఖమయమవుతుంది,శాంతి లభిస్తుంది.మనం ఏమి చేయాలో,ఏలా చేయాలో అర్ధమవుతుంది.భగవద్గీతను యువత ఖచ్చితంగా చదవాలి.
ఇక అందరు అంటారు భగవద్గీత ఒక "మతగ్రంధం" అని.మనం ఇతర మతగ్రంధాలను చదివితే,అందులో ఇతర మతస్థులను ద్వేషించమని,చంపమని,వారు జంతువులకంటే హీనమని చాలా చాలా కనిపిస్తాయి.కాని గీతలో ఇటువంటి వాక్యాలు ఒక్కటి కూడా కనిపించవు.అందరిని ప్రేమించమని,అందరు ఒక్కటేనని,అంతా పరమాత్మ మయమేనని గీత అంటుంది.గీతను మతగ్రంధంగా చూస్తే ప్రపంచంలో అన్ని మతాలవారిని ప్రేమించమని చెప్పిన "ఏకైక"మతగ్రంధం భగవద్గీత.కాని భగవద్గీత మతగ్రంధం కాదు.అది సద్చిదానందుడు,నిరాకరుడు,నిర్గుణుడు,నిత్యుడు,పరంధాముడైన పరమాత్మ వచనం.
నిజమైన దేవుడు ఆయనను నమ్మినా,నమ్మకున్న ఎవరిని ద్వేషించడు,ద్వేషించమని చెప్పడు.అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు.గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు.అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం.ఒక ఆశాపుంజం.
అంతేనా?భగవద్గీత ఈరోజు ఒక management science.ప్రపంచంలో ఉన్న universities లో ఇతరులని ఎలా manage చేయాలో నేర్పుతారు.కాని గీత మనల్ని మనం ఏలా manage చేసుకోవాలి నేర్పుతుంది.ఎందుకంటే మనల్ని మనం నియత్రించుకోకపోతే,ఇక లోకాన్ని ఎలా నియంత్రిస్తాము?అందుకే ఈరోజు గీతను పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒక management science గా బోధిస్తున్నారు.
భగవద్గీత సన్యాసుల కోసమంటారు కొందరు.భగవద్గీత చదివినవారు సన్యాసులైతే ఈరోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేది కాదు.ఎందుకంటే భగవద్గీత గాంధీ,భగత్ సింగ్ వంటి ఎందరో మహానుభావులను ఈ దేశానికి అందించింది.ఈ ప్రపంచానికి E =mc²
సూత్రాన్ని చెప్పిన Albert Einstein,
తాను ఆ సూత్రం చెప్పడానికి ప్రేరణ
 ఇచ్చింది భగవద్గీత
 అని చెప్పిన మాటలు మనం మరచిపోకూడదు.
Alexander గురువైన Aristotle కూడా Alexander భారతదేశం నుండి
 తిరిగివస్తున్న సమయంలో భగవద్గీత తీసుకురమ్మని చెప్తాడు.
భగవద్గీతను చదవడం కాదు,అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది.అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా,కొద్దిగా గంగాజలం త్రాగినా,కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు.వారికి మోక్షం లభిస్తుంది.
భగవద్గీతను రోజు చదవండి.
 * ‘భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.
 * సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.
 * సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.
 * ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.
 * ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్నెస్ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్ చేసే మేజిక్. మైండ్ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.