24, జూన్ 2015, బుధవారం

ఓ కూతురు + ఓ చెల్లి + ఓ భార్య + ఓ తల్లి + ఓ ఉద్యోగిని + ఓ అత్త + ఓ బామ్మ = సగటు స్త్రీ మూర్తి


“సహనం లో భూమాత ను తలపించే
ఆ స్త్రీ మూర్తి
జీవితం అనే నాటకం లో
పలు పాత్రలకు జీవం పోసింది”

“ఒక తల్లిగా
బిడ్డకు జన్మనిచ్చి, లాలించి, పాలించింది
సోదరిగా
అక్కున చేర్చుకుంది
మిత్రురాలిగా
ఆదర్శప్రాయం గా నిలిచింది
భార్య గా తోడూ-నీడ గా నిలిచిన
ఆ స్త్రీ మూర్తి కి నా వందనాలు”