21, జూన్ 2015, ఆదివారం

వేదంలా ఘోషించే గోదావరి

వేదంలా ఘోషించే గోదావరి.... సీతరాములు పాదాల‌తో తాక‌గానే పునీతమైన గోదావరి..
ప‌ర‌మ ప‌వితర‌మైన ఆ గోదావ‌రి తీరంలో రాముడు ఉండ‌డం వ‌ల్ల ఎంతో పుణ్య‌స్థ‌లంగా భద్రాచలము గుర్తింపు పొందింది
 అంతటి పవిత్రమైన గోదావరి నది ప్రవహించడం వల్ల దిగువన ఉన్న గౌతమీ పరివాహక ప్రాంతాలు పుణ్య క్షేత్రాలు గా ప్రసిద్ది చెందినవి..
ఆ గోదావరి నది ఎగువ నుంచి దిగువకు ప్రవహించే ప్రాంతాలు ను ప‌శ్చిమ‌గోదావ‌రి & తూర్పుగోదావ‌రి జిల్లాల విభ‌జిస్తూ గోదావ‌రి ప్ర‌వ‌హిస్తోంది.


తొలకరి వర్షపు జల్లులతో పుడమితల్లి పరవసించెను.గోదావరి జిల్లాల మనుషులు మనసులు పులకరించేను..
అంద‌మైన కొబ్బ‌రి చెట్లు..అబ్బుర‌ప‌రిచే సప్త గోదావ‌రి తీరంతో .. అమర ధామం లా శోబిల్లె మా కోనసీమ...
శతాబ్దాల చరితగల సుందర సీమ..కోన‌సీమ ప‌ల్లెద‌నంతో ప్ర‌కృతి ఒడిలో ఒదిగిపోయి తూర్పుగోదావ‌రి జిల్లాకు మ‌ణిహారంలా మారింది
 అంతటి పవిత్రమైన మా గోదావరి మాత కి వచ్చే నెలలో జరిగే మహొస్తవమ్ గోదావరిపుస్కరాలు ........ఇప్పుడు మనకి అంతటి గొప్ప ఆ మహార్బాగ్యం
 బృహస్పతి సింహ రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు గోదావరి మహా పుష్కరం 14 జూలై 2015 న ఉదయం 6:26 గంటలకు మొదలవుతుంది ...అనగా తెలుగు క్యాలండర్ ప్రకారము
 శ్రీ మన్మధ నామ సమ్వస్థర అధిక ఆషాడమాసం కృష్ణ పక్ష త్రోయోదశి అనగా మంగళవారము... . మహా పుష్కరం మొదలయ్యి జూలై 25ముగింపు తేదీ ...
ముక్యం గా మా కోనసీమలో సందర్శించాల్సిన పుణ్య క్షేత్రాలు చాల ఉన్నాయి .....అందులో కోనసీమలో మొదటిగా త్రేవిని సంగమము అయిన అంతరవేది,
మొదలుకుని,కపిలేశ్వరము ,ముక్తేశ్వరము, కుండళేస్వరము, బోడసకుర్రు , పల్లంకుర్రు, కేశనకుర్రు,మురమళ్ళ ,
అద్దంకి వారి లంక, యెదుర్లంక,గేదిల్లంక, శానపల్లి లంక, ఊబలంక, కొత్తలంక,గోడిలంక,
అలాగా చెప్పుతూ పోతే ఇంకా ఎన్నో ప్రధాన పుణ్య క్షేత్రలతో కూడిన గోదావరి రేవులు మా కోనసీమలో ఉన్నాయి ...మిత్రులా మీరు అందరు గోదావరి పుష్కర సమయం లో తప్పకుండ ఆ పన్నెండు రోజులు పన్నెండు చోట్ల పుష్కర స్త్నానం ఆచరించి గోదావరిమాత కృపతో పునీతులు అవ్వండి ....