24, జూన్ 2015, బుధవారం

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 – జూన్ 17, 1858) (హిందీ- झाँसी की रानी మరాఠీ- झाशीची राणी), మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది