4, జులై 2015, శనివారం

స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902)

స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902) యువతకు ఆదర్శప్రాయంగా, దిశనిర్ధేశాన్ని చేస్తూ తన జీవితాన్ని అకింతం చేసిన ఒక గొప్ప మహానీయుడు స్వామి వివేకనందుడు… భారతదేశంలో స్వామి వివేకనందుడి పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.. ఆధునిక యుగపు గొప్ప ఆధ్యాత్మిక వేత్తలలో ఆయనొకరు. ప్రసిద్ధి గాంచిన గొప్ప హిందూ మత యోగి స్వామీ వివేకానంద పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. 1863 జనవరి 12న కలకత్తాలో(కొల్కత) భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తు దంపతులకు వివేకనంద జన్మించాడు. రామకృష్ణ పరమహంసగారి అత్యంత ప్రియమైన శిష్యుడు.

భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామీ వివేకానంద .
వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి .చిన్న తనం నుండే వివేకనందుడు వివిధ మత సిద్దాంతాలను ఆకళింపు చేసుకున్నాడు. కొంత కాలం బ్రహ్మ సమాజంలో గడిపాడు. తదుపరి రామకృష్ణ పరమహంస కు అత్యంత ప్రితిదాయకమైన శిష్యుడిగా ముద్ర వేయించుకున్నాడు. రామకృష్ణ పరమహంస చేసిన భోదనలను శ్రద్దగా ఆచరిస్తూ అందరిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అంతలోనే రామకృష్ణ పరమహంసం మరిణించడంతో వివేనంద సన్యాసం స్వీకరించి హీమాలయాలకు వెళ్లి ఆరు సంవత్సరాలు ద్యానంలో గడిపాడు. అప్పటి నుండి నరేంద్రనాథదత్తు వివేకనందస్వామి గా మారాడు..1893 లో చికాగొలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందు మత ప్రతినిధిగా వివేకనందుడు హాజరయ్యాడు. ఈయన సమ్మేళనంలో ప్రసంగించిన తీరు భారతదేశాని కే ఒక గుర్తింపును తీసుకు వచ్చింది. నాలుగున్నర సంవత్సరాలు అమెరికా, ఇంగ్లాడు, స్వీట్జర్లాండు, శ్రీలంక దేశాలలో చేసిన ఉపన్యాసాలు ఆధ్యాత్మికతకు , సామరస్యానికి, గొప్ప సంస్కృతికి భారత భూమి నిలయమని ప్రపంచ దేశాలు గ్రహించేలా తను చాటి చెప్పాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామీ వివేకానంద .
ఇంగ్లాడులో వివేకనంద ఉపన్యాసానికి మంత్ర ముగ్దురాలైన మార్గరెట్ నోబుల్ శిష్యురాలిగా మారిపోయింది. భారతదేశానికి వచ్చిన ఆమె సిస్టర్ నివేదితగా మారింది.
వివేకనందుడు తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. తర్వాతి కాలంలో తాను ఎన్నో రచనలు చేశాడు. రాజయోగము మొదలైన గ్రంథలను ఆయన రచించాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ ఆయన ఆత్మ,మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యధావిధిగా ఆయన రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత ఆయనకు చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయనఅలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది.చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే చాలా భాద పడ్డారు . ఈ రోజు స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిద్దాం