26, జులై 2015, ఆదివారం

నేడు (జులై 26, 1999) 16వ "కార్గిల్ విజయ్ దివాస్"


దేశం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి అహర్నిశలు పహారా కాస్తున్న సోదర, సోదరి భారతీయ వీర జవానులకు పాదాభివందనాలు చేస్తూ,
దేశ రక్షణ కోసం "కార్గిల్ " యుద్దంలో అశువులు బాసిన అమర జవానులందరికి మా "నవ యువ భారత్" తరపున జోహార్లు అర్పిస్తు, అంజలి ఘటిస్తున్నాము..
సాటిలేని దేశభక్తుడవోయి ఓ సాహస సిపాయి
---------------------------------------------------
కన్నవారిని వదిలి కష్టాలకు అదరక బెదరక
 గాలివానకు ఎదురొడ్డి కాలినడకన కావలికి సాగి
 సరిహద్దే నీడై సాటి జవానులే తోడై ధైర్యమున కదిలి
 నీ గడ్డను కాపాడుకుంటున్న యోధానుయోధుడా
 సాటిలేని దేశభక్తుడవోయి ఓ సాహస సిపాయి
 పుట్టిన ఊరును వదిలి, బంధుమిత్రులకు దూరమై
 మనసైన నెచ్చెలిని విడువలేక ఇంటికడ నిలువలేక
 సరిహద్దులలో ప్రాణాలు లెక్కచేయక మాకై పోరు సలిపే
 మమ్ము ఉద్దరించు త్యాగధనుడా , దీటురాదు ఏదీ లోకాన
 సాటిలేని దేశభక్తుడవోయి ఓ సాహస సిపాయి
 నీకై ఎదురుచూస్తున్న నీ వాళ్ళకు కడు దూరంగా భారంగా
 ఎప్పుడు కలవగాలవో తెలియక కన్నీళ్లను దిగమింగి నిబ్బరంగా
 కొండకోనల వాగువంకల నడుమ చలిచీమను సైతం వదలక
 మా కావలివై నిశ్చింతను మాకు నిశ్చయముగా తెచ్చిన ఘనుడా,
సాటిలేని దేశభక్తుడవోయి ఓ సాహస సిపాయి
 శత్రువును మన దేశము నీడను సైతం తాకనీయ్యక, తగలనీయ్యక
 గుండె రాయి చేసుకుని, మానవతను మనసున విడువక గట్టిగా పట్టి
 హద్దు కాసే ద్వారపాలుకుడైన నీకు ఏమివ్వగలం ఒక్క నమస్కారం తప్ప
 సాటిలేని దేశభక్తుడవోయి ఓ సాహస సిపాయి
---------------------------------------------
 -----------------------
జోహార్ కార్గిల్ అమరవీరులకు.. జోహార్.. జోహార్.
 "భరత్ మాత కీ జై"