23, జులై 2015, గురువారం

మీ భారతీయుడు

భావి భారత పౌరులను బావిలో కప్పలా బ్రతకనీయకండి.....స్వేచ్చను పొందేలా , ప్రశ్నించగలిగే సామర్ద్యం పెంపొందించేలా, హక్కులను నూరిపోస్తూ, దేశ ఔన్యత్యాన్ని చాటిచెబుతూ.....మనలా కాకుండా దేశంలో పాగా వేసిన తెల్లదొరలపై తిరగబడ్డ చంద్రబోస్ లా, భరతమాత సంపదను దోచుకెళుతుంటే ఓర్వలేక ఎదురుతిరిగిన భగత్ సింగ్ లా, అమ్మ కాదు అమ్మని కన్న దేశమే ముఖ్యమని పోరాటం చేపట్టిన ఆజాద్ లా..., ముక్కుమూసుకున్న మూడు గడియలకి పోయే ప్రాణం అంటే నాకు భయం లేదని రొమ్ము చూపించిన అల్లూరి లా, అణిచివేయాలని చూస్తే అణగదొక్కుతామని చాటి చెప్పిన ఝాన్సి లక్ష్మి లా, దేశ భవిష్యత్తుకై కలలు కన్న రవీంద్రనాధ్ ఠాగూర్ లా, వెనుకబడ్డా ముందు ఉంటామని రుజువుచేసిన అంబేద్కర్ లా, ఉన్నత పదవులు అనుభవించినా మచ్చ అనేది లేకుండా ఉన్నంత బ్రతికిన అబ్దుల్ కలాం లా..........
 ....మీ పిల్లలకు త్యాగం, సేవా, దేశాభిమానం, సంస్కారం, చదువు, నిజాయితీ, ప్రేమా, తిరుగుబాటు ఇవి నేర్పించండి చాలు.........భావి భారత పౌరులు మన దేశాన్ని మనకన్నా గొప్పగా నడిపిస్తారు..........