15, జులై 2015, బుధవారం

గోదావరి తల్లి,,,,తన బిడ్డలకు పంపుతున్న ఆహ్వాన పత్రిక..నా బిడ్డలారా.. తల్లి ని గౌరవించి పూజించటం అనేది ఒక కులానికో మతానికో చెందినా విషయం కాదు అందుకే నా పండుగ కు అందరూ ఆహ్వానితులే.. ఆకిలేవేస్తే అన్నం పెట్టాను..దాహం అంటే గొంతు తడుపుతున్నాను.. కాలుష్యం తో నన్ను నింపెస్తున్న ప్రతీ సారి, పాలు తాగే చంటి పిల్లడు తాన పాల పళ్ళతో చనులను గాయపరిచినా,,, తల్లి ఆ బాధను తన గుండెల్లోనే ఎలా దాచుకుంటుందో అలాగే దాచుకున్నాను ... నా స్నానం ఆచరించటానికి కొంత మందికి మతం అడ్డు వస్తుంది.. నా బిడ్డలు ఆకలితో ఏడుస్తున్నప్పుడు వారి ఆకలీని తీర్చడానికి నాకు ఏ మతం అడ్డు రాలేదు..నేను పుట్టిందో ఎక్కడో కావచ్చు కాని మీకు గుర్తింపు ఇచ్చినందుకు ఆనంద పడుతున్నాను.. మాది గోదావరి జిల్లా ని మీరు గర్వంగా చెప్పుకుంటున్న ప్రతీ సారి నేను ఎంత మురిసిపోతానో తెలుసా.. ఎంతైనా తన బిడ్డలు ఉన్నత స్థాయికి వెళితే ముందుగ గర్వపడేది తల్లే కదా.. నా ఈ పండుగ వచ్చే వారందరూ సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. క్షేమంగా వచ్చి లాభంగా తిరిగి వెళ్ళండి.. సర్వేజన సుఖినో భవంతు....!!!!