16, జులై 2015, గురువారం

ఇది మరవకు మిత్రమ


 ఏముంది ? ఏముంది? ఏముంది ? ఈ దేశానికి గర్వ కారణం
 ఆకలి చావులు అనాధాల ఆర్తనాదాలు అవినీతి నేతలు
 గుండెను మెలి పెడుతుంటే మనస్సును కలిచి వేస్తుంటే
 నయవంచకుల కల్ల బొల్లి కబుర్లకు బలవ్వనేల
 ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడక
 మత్తు వదిలి మైకం వదిలి మేలుకో
 కదులు ఒక్కో అడుగు మున్ముందుకు కదిలించు
 ఒక్కొక్కరి గుండెల్లో అగ్ని శిఖలు రగిలించు
 అవనీతి గుండెల్లో నిదురించు
 కదులు ఒక్కో అడుగు మున్ముందుకు కదిలించు ఒక్కొక్కరినీ
 చైతన్య పరుస్తూ చైతన్య పధంలో
 ఓ నాటికీ తప్పక సాధించేవు నీ స్వప్న జగతిని
 ఇదీ నా ప్రపంచామనీ సగర్వంగా