18, జులై 2015, శనివారం

పల్లె అంటే అందం

పచ్చని పంట పొలాలు,
కల్మషం లేని మనుషులు,
ఏటి గట్టు వెంట జానపదాలు,
బడిలో నేర్చిన జీవిత పాఠాలు,
బాబాయ్, పిన్ని, వదిన, అన్నయ్య..
అనే ఆప్యాయపు పిలుపులు,
అమ్మనాన్నంటే భయం, గౌరవం,
అన్నింటికి మించి..
తేట తెలుగు సాంప్రదాయాలు,
ఆహా..
అందం అంటే పల్లె,
పల్లె అంటే అందం!