26, జులై 2015, ఆదివారం

జుట్టు బాగా పెరగాలంటే …?

ఈ మధ్యకాలంలో అందరికీ జుట్టు రాలిపోవడం సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా తెల్లబడటం, రాలిపోవడం జరుగుతోంది. ఆరోగ్యం ఉన్న వారిలో సైతం జుట్టు ఊడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సవాలక్ష కారణాలు ఉండవచ్చు. అయితే సింపుల్ చిట్కాతో ఊడిపోతున్న జుట్టును మళ్లీ ఒత్తుగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు డెర్మటాలజీ వైద్యులు.
కూరల్లో ఉల్లిపాయను వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అలాంటి ఉల్లిపాయతో ఇప్పుడు జుట్టును కూడా సంరక్షించుకోవచ్చని జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ పరిశోధనలో తేలింది. ఉల్లిపాయముక్కలను జ్యూస్ గా చేసి తలకు పట్టించి కొద్ది నిమిషాలు ఉంచుకోవాలి. ఆతర్వాత తలస్నానం చేయాలి. ఇలా 6 వారాల పాటు చేస్తే జుట్టు రాలిపోవడం, తెల్లబడటం ఆగిపోతుంది. అంతేకాదు ఒత్తుగా కూడా పెరుగుతుందని తేలింది.
 * ఉల్లి జ్యూస్ ను తలకు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు ...
• రక్త ప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది . అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
• యుక్తవయసులోనే తెల్లబడిన జుట్టును తగ్గిస్తుంది.
• ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. అది జుట్టును ఒత్తుగా ఉంచుతుంది.
• వంశపార్యంపరంగా వచ్చే జుట్టు సమస్యలకు ఉల్లి సహజసిద్ధమైన మందు
• డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది.
• తలలోని ఎలర్జీ ఇతర సమస్యలను కూడా నయం చేస్తుంది.