21, జులై 2015, మంగళవారం

మీలో ప్రవహించేది ఈ గ్రూప్ రక్తమా అయితే.......


ఏ పాజిటివ్ (A+). మీలో ప్రవహించేది ఈ గ్రూప్ రక్తమా అయితే మీరు మంచి లీడర్ షిప్ క్వాలిటీ కలవారు. అందరిని ఇట్టే తమవైపు తిప్పుకోగలరు. అలాగని వచ్చే ఎన్నికల్లో ఏదో నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్లాన్ వేసుకోవాలా అని మాత్రం మమ్మల్ని అడగకండి!
ఎ నెగెటివ్ (A-). మీది ఈ బ్లడ్ గ్రూపా.. అయితే కొండల్ని పిండి చేసేంత కష్టపడే తత్వం కలవారు మీరు. కష్టానే నమ్ముకునే నేచర్ మీ సొంతం.
బి పాజిటివ్ (B+). ఈ వర్గం వాళ్లయితే, సాక్రిఫైజ్ చేయడంలో ముందుంటారు. త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్ లా, శిబి చక్రవర్తికి జిరాక్స్ కాపీలా ఉంటుంది వీళ్ల స్వభావం.
బి నెగెటివ్(B-). మీ బ్లడ్ గ్రూప్ ఇదైతే..మీలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ, సెల్పిజం ఉంటుంది, కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓ పాజిటివ్…(O+) వీరు ఐన్ స్టీన్ కు వారసుల లాంటి వారు, వీరి మైండ్ శంకర్ రోబో కన్నా యమఫాస్ట్.. వీరిని అర్థం చేసుకోవడం ఆషామాషి విషయం కాదు.
ఓ నెగెటివ్..(O-) ఉలకరూ .పలకరూ అంటారే ఆ టైప్ ఈ రక్త వర్గం వారు.. రిజర్వ్ డ్ గా ఉంటారు. కవిత్వాలు రాసుకుంటూ, బాత్ రూమ్ లో పాటలు పాడుకుంటూ, తమలో తామే గొనుక్కునే రకం వీరు.
ఎబిపాజిటివ్ (AB+). ఇతరులకు సహాయం చేయబడును అనే బోర్డ్ మెడలో ఉండదు, కానీ అంతకంటే ఎక్కువగానే సహాయం చేస్తారు పక్కవాళ్లకి. హెల్ప్ చేయడం కోసం పోటీపడే తత్వం వీరిది.
ఎబి నెగెటివ్ (AB-). మూడు చేపల కథలో ప్రాప్తకాలజ్ణుడి టైపు.. సంధర్భానికి తగినట్టు వ్యవహరిస్తారు. లాభం లేనిది గడ్డిపోచను కూడా పక్కన పెట్టరు ఈ టైపు బ్లడ్ గ్రూప్ వాళ్ళు..