27, జులై 2015, సోమవారం

స్నేహితులలోనే జీవితం దొరుకుతుంది

నేను ఇంటికి ఆలస్యంగా రావడం చూసి డాడీ కోపంగా
" ఇంత సేపూ ఎక్కడున్నావురా " అని గద్దించారు . "
ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను డాడీ " నెమ్మదిగా జవాబ
చెప్పాను .
అనుమానం గా ఆయన నా ఫ్రెండ్స్ లో పది మందికి
స్పీకర్ ఆన్ చేసి నా ముందే ఫోన్ చేశారు .
ఏమని చెప్పను ............?
నలుగురు ఫ్రెండ్స్ " అంకుల్ వాడు ఇంకా ఇక్కడే
ఉన్నాడు " అని చెప్పారు .
ముగ్గురు " ఇప్పుడే ఇంటికి బయలు దేరాడు
అంకుల్ " అని చెప్పారు .
ఇద్దరేమో " అంకుల్ ఇక్కడే ఉన్నాడు
చదువుకుంటూ ఉన్నాడు , ఫోన్ ఇవ్వనా " అన్నారు .
ఒక హౌలా గాడయితే , నా గొంతుకుతో " డాడీ నేను
ఇక్కడే ఫ్రెండ్ ఇంట్లో చదువు కుంటున్నాను ,
ఏదయినా పనుందా " అనడిగాడు .
ఇది చూసి డాడీ కూడా నవ్వేసి " జీవితం లో
స్నేహితులు దొరకడం కాదురా , స్నేహితులలోనే
జీవితం దొరుకుతుంది రా
" అనేసి
వెళ్ళిపోయారు .
😍😏😏