28, జులై 2015, మంగళవారం

రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్

ఇకలేరు


 రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్


 సామాన్యుల కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడు పేపర్ బాయ్ గా పనిచేశారు. కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. సైంటిస్టుగా కెరీర్ ఆరంభంచి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారు. దేశానికి వెలకట్టలేని సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న స్వీకరించారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం అధిరోహించారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్థానమిది. కోట్లాది మంది స్ఫూర్తిగా నిలిచిన అబ్దుల్ కలాం ఇకలేరు. సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన ఆశయాలు, కలలు ఎప్పటికీ బతికే ఉంటాయి. కలాం జీవితంలో కీలక ఘట్టాలు..


పూర్తి పేరు: ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం

 జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం (తమిళనాడు)

వయసు: 84

తల్లిదండ్రులు: అషియమ్మ, జైనులబుద్దీన్


 విద్య
 పాఠశాల విద్య: రామనంతపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్
 కాలేజీ విద్య: తిరుచిరాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్లో డిగ్రీ, మద్రాసులో ఏరోస్పేస్ ఇంజినీరింగ్


 సైంటిస్టుగా కెరీర్
 ఉద్యోగం: 1960లో డీఆర్డీఓలో సైంటిస్టుగా చేరిక
 ఇస్రోతో అనుబంధం: 1969లో ఇస్రోకు బదిలీ, ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరణ.
1990 వరకు ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు, పీఎస్ఎల్వీ, ఎస్ఎల్వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర
 డీఆర్డీఓ: 1992-99 మధ్య డీఆర్డీఓ సెక్రటరీగా బాధ్యతలు
 ప్రధాని సాంకేతిక సలహాదారుగా బాధ్యతలు
 కలాం సారథ్యంలో ప్రోక్రాన్-2 అణుపరీక్షల నిర్వహణ


 రాష్ట్రపతి పదవీకాలం: జూలై 25, 2002-జూలై 25, 2007


కలలు కనండి ..కలలు సాకారం చేసుకోండి... అన్న మహానుభావుడు మన కళ్లముందు నుండి వెళ్లిపోయారు...... దేశంకోసం నిస్వార్దంగా కృషి చేసిన గొప్పమనుషులు స్వాతంత్ర్యం ముందు ఉండేవారని విన్నాను...కాని ఈ రోజుల్లో కూడా ఉన్నారని నిరూపించిన మహామనిషి ఏ.పీ.జే........నా కళ్లు అదృష్టం చేసుకున్నాయి ఇలాంటి పుణ్యమూర్తిని నా జీవితంలో చూశా.....కాని ఆయన లేరనే వార్త విన్నవెంటనే తెలియకుండానే కన్నీళ్లు బయటకి వచ్చేశాయి.....ఆకాశం అంచు ఎంత దూరంలో ఉంటుందో అబ్దుల్ కలాం స్పూర్తి అంత దూరం వ్యాపించింది అనడంలో సందేహం లేదు.......ఆయన మరణంతో ఇక నిజాయితి కూడా మరణించింది.........దేవుడా నువ్వు నిజంగా ఉండి ఉంటే మళ్లీ ఈ పుణ్యభూమిలో ఈ పుణ్యాత్ముడిని పుట్టించు............జోహార్ ఏ.పీ.జే కలాం గారు.....జోహార్.............


దేశ యువతకు ఆదర్శం, భారతరత్న, "ఏ.పీ.జె అబ్దుల్ కలాం" గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను - మన భారతదేశం (sun rise india )