29, జులై 2015, బుధవారం

కృషి ఉంటే మనుషులు ఋషులవ్వరు..ఏ.పీ.జే అబ్దుల్ కలాంలు అవుతారు

నేను గాందీజీ గారి అహింస మార్గాన్ని చూడలేదు..కలాం గారి మనసుని చూశా...
నేను నేతాజీ గారి పోరాట పటిమ ను చూడలేదు...కలాం గారి ఆలోచన విధానాన్ని చూశా...
నేను స్వామి వివేకానంద.గారి పలుకులు వినలేదు...కలాం గారి  ప్రసంగాలు విన్నా...
నేను సర్వేపల్లి రాధాకృష్ణ.గారి భోదన పద్దతి చూడలేదు...కలాం గారి
ప్రభోదనలు విన్నా...
నేను ఋషులని చూడలేదు...కలాం గారి లాంటి మహాపురుషుడ్ని చూశా....
ఇప్పటివరుకు నేను చాలా మంది మనుషులని చూశా....కాని కలాం గారి లాంటి మహానుభావుడ్ని మాత్రం చూడలేదు........కృషి ఉంటే మనుషులు ఋషులవ్వరు..ఏ.పీ.జే అబ్దుల్ కలాంలు అవుతారు...................