18, జులై 2015, శనివారం

స్వామి వివేకానందున్ని రక్షించుకొన్న భగవంతుడు......స్వామి వివేకానందుల జీవితంలో భగవంతుడు చూపిన కొన్ని లీలలను చూస్తే భగవంతుడు తన భక్తుల కొరకు ఎంత తపిస్తాడో చూద్దాం...
 "అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే
 తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం"
ఎవరైతే నన్ను అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్నది భగవంతుడి ప్రతిజ్ఞ.
ఇది ఎంతమాత్రం నిజమో పరీక్షిద్దామని స్వామి వివేకానందుడు అనుకొన్నాడు.
ఏమీ తినకుండా ఒక అడవిలో ప్రయాణించసాగాడు. ఒక రోజంతా ఉపవాసంలోనే ఉన్నాడు. ఐనా ఏమీ తినలేదు. ఉన్నట్టుండి వెనుక నుండి ఎవరో పిలుస్తున్నట్లు వినిపించింది. ఒకతను ఒక మూటలో ఆహారపదార్థాలు ఉంచుకొని వస్తూ "స్వామీ ఆగండి, మీ కోసం ఆహారం తీసుకొని వస్తున్నాను" అన్నాడు. ఐనా వివేకానందుడు వినిపించుకోకుండా పరుగెత్తసాగాడు. వెనుక పిలుస్తున్న వ్యక్తి కూడా ఒక కిలోమీటర్ దూరం వెనుక పరుగెత్తి స్వామిని పట్టుకొని తినమని నిర్బంధించడంతో స్వామి వివేకానందులు ఆనందభాష్పాలతో తిన్నారు.