29, జులై 2015, బుధవారం

నీకిదే మా సలాం!

అశ్రు నివాళి
 నీ ఆశయాలు" త్రిశూల్ "వలె ధృఢమైనవి!
నీ త్యాగం" అగ్ని" వలె పునీతమైనది!
నీ దేశభక్తి "పృథ్వి" వలె
 విశాలమైనది!
నీ అంకితభావం" ఆకాశ్" వలె అనంతమైనది!
నిను కన్నది ధనుష్కోటి గడ్డ! శతకోటి భరతప్రజల "హృదయమే"
నీకు అడ్డా!
రామేశ్వరం లోని పరమేశ్వర
 అంశయే ఈ అవుల్ పకీర్ అద్భుత కలాం!
నీవు లేవనేది కలైతే
 ఎంత బాగుంటుంది కలాం!
నీకిదే మా సలాం!