19, జులై 2015, ఆదివారం

గోదార‌మ్మని మ‌లినం చేసే స‌క‌ల వ్య‌వ‌స్థ‌ల‌ను త‌రిమికొడ‌దాం

గోదార‌మ్మని మ‌లినం చేసే స‌క‌ల వ్య‌వ‌స్థ‌ల‌ను త‌రిమికొడ‌దాం
 గోదావ‌రిని చూస్తే అనంత‌మైన శ‌క్తి తెలియ‌కుండానే మ‌న‌లోకి ప్ర‌వేశిస్తుంది. అమ్మ‌లా క‌నిపెట్టుకొని కోట్లాది మంది గొంతులు త‌డుపుతున్న గోదారిని కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంది. మ‌న‌కు బ‌తుకునిచ్చి.. మ‌న పూర్వీకుల ద‌గ్గ‌ర నుంచి మ‌న వ‌ర‌కు అన్నం పెడుతున్న గోదావ‌రి త‌ల్లిని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తీ ఒక్క‌రు మీద ఉంది. విశ్వ‌మాన‌వ‌వేదిక స్వ‌చ్ఛ గోదావ‌రి కావాల‌ని బ‌లంగా కోరుతోంది. గోదావ‌రి పుష్క‌రాలు ఇందుకు నాంది ప‌ల‌కాలి. 12 ఏళ్ల‌కు ఒక్క‌సారి వ‌చ్చే గోదావ‌రి పండ‌గ సాక్షిగా గోదావ‌రి దీక్ష‌ను ప్ర‌తీన‌బూనాలి. పుష్క‌రాలు అనంత‌రం విశ్వ‌మాన‌వ‌వేదిక సేవ్ గోదావ‌రి మ‌హోద్య‌మం ప్రారంభ‌మ‌వుతుంది. నా వ‌ర‌కు వ్య‌క్తిగ‌తంగా గోదావ‌రి దీక్ష‌ను చేప‌ట్టాను. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం గోదావ‌రి పుష్క‌ర ఘాట్‌లో తొలిరోజు ఉద‌యాన్నే పుష్క‌ర స్నానం చేశాను. 12 రోజుల పాటు ఇదే రీతిలో కొన‌సాగుతోంది. గోదావ‌రి దీక్ష‌ను అత్యంత నిష్ఠ‌తో చేయ‌డంతో అనంత‌మైన పోరాటశ‌క్తి అబ్బుతుందని న‌మ్ముతున్నాను