5, జులై 2015, ఆదివారం

నిమ్మను మేలు...!


ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు నీటిలో కాసింత నిమ్మరసం పిండుకుని తాగడం అందరికీ తెలిసిందే కాని.. అది చేసే మేలు తెలుసుకుంటే ఆ అలవాటును ఇక వదలం..!
• ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రం అవుతాయి. ముఖ్యంగా మూత్రవిసర్జనకు అడ్డంకులు తొలగుతాయి.
• రోగనిరోధక శక్తి ఎంత పెరిగితేనే అంత మంచిది. లేకపోతే రుతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.
• నీటిలోకి నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల కాలేయం నుంచి బైల్‌ అనే యాసిడ్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్‌ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది.
• మలేరియా, కలరా, టైఫాయిడ్‌ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో రుజువైంది.
• రక్తనాళాలను చురుగ్గా ఉంచి, అధిక రక్తపోటును తగ్గించే గుణం విటమిన్‌ సి (బయోఫ్లేవనాయిడ్స్‌) కి ఉంది. ఈ విటమిన్‌ నిమ్మ రసంలో దొరుకుతుంది.
• మధుమేహం ఉన్న వాళ్లకు కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు.