22, జులై 2015, బుధవారం

గాంధీజీ ఆత్మకథ సత్యశోధన....నేను సత్య శోధకున్ని

ఆ శోధన కోసం నాకు ఏంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించుటకు నేను సిద్ధమే
 ఈ మర్గాన నడుస్తున్నప్పుడు భయంకరమైన పొరపాట్లు కూడా నాకు తుచ్చమైనవిగా కనబడతాయి
 ఈ జగత్తులో సత్యం దప్ప మరొకటి ఏమి లేదను నమ్మకం రోజురోజుకు నాలో పెరుగుతూవున్నది
 సత్య శోధనకు సంభదించిన సాధనాలు ఎంత కఠినమైనవో అంత సరళ మైనవి కూడా !
ప్రపంచమంతా ధూళి కణాన్ని కాలిక్రింద త్రొక్కి వేస్తుంది , అయితే, సత్యాన్వేషకుడు ధూళి కణం కూడా త్రొక్కి వేయలేనంత సూష్మంగా వుండాలి.
హిందూ ,క్రైస్తవ ,ఇస్లాం మతాలూ కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి .
నా వంటి పలువురు శోధకులు మ్రగ్గిపోయినా సత్యం మాత్రం సదా జయించాలి .
 _మోహన్ దాస్ కరంచంద్ గాంధి

 గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -01
శుద్ధమైన ప్రేమవల్ల జరగని పని అంటూ ఏది ఉండదు
 ఎవరి నిష్ఠ పవిత్రంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ వుంటాడను సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది
 మరొకరిని మోసగించడం ఎరుగని వాణ్నికనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను
 నిజం మాట్లాడే వారు , నిజాయితీగా వ్యవహరించేవారు ఏమరిచి ఉండకూడదని గ్రహించాను
 నచ్చని విషయాల్ని మర్చిపోవడం , నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు .
మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి .
తెలివి తేటల్ని వుపయోగించి సరళ ప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా బోధ పడుతుంది
 ప్రతి హిందూ బాలుడూ , బాలికా సంస్కృతం చక్కగా నేర్చుకోవడం అవసరం.
ఒక భాషనూ శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం ఆవుతాయి.


 గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -02
ఇతరులని సంస్కరించడం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించాను
 స్నేహం లో అద్వైత భావం ఉంటుంది . సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది , నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది . అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం . అసలు అతి స్నేహం పనికి రాదనీ నా అభిప్రాయం .
ఆత్మీయ మైత్రి ని , భగవంతుని మైత్రి ని కోరుకునేవాడు ఏకాకిగా ఉండాలి , లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి .
దేవుని అనుగ్రహం వల్ల కర్తకు , అతనికి సంభందించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని వుంటాయి . ఆ విధంగా ఆపద తప్పి పోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుని అనుగ్రహాన్ని గురించి మానవుడు యోచిస్తాడు
 మనిషి వికారాలకు లోనవడం అందరికి తెలిసిన విషయమే . అదేవిధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాల్ని తొలగించి మనిషిని రక్షిస్తూ వుండటం కూడా అందరికి తెలిసిన విషయమే
 ప్రపంచం నీతిమీద నిలబడి వున్నది .నీతి అనేది సత్యంతో కూడి వుంది .
అపకారానికి ప్రతీకారం అపకారం కాదు , ఉపకారం సుమా! అను సూత్రం నా జీవితానికి మూలమైంది .
అహింసా శక్తి అమోఘం
 సత్యా రాధకునికి మౌనం అవసరమని నాకు కలిగిన అనుభవం . సామాన్యంగా అబద్ధం చెప్పడం , తెలిసో తెలియకో అతిశయోక్తులు పలకడం ,సత్యాల్ని మరుగు పరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం . అయితే మితబాషి అర్థం లేని మాటలు మాట్లాడదు . ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు .
 _యం.కే .గాంధి.

 గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -03
ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకి , తాను ఇచ్చే ప్రతి పైసకి లెక్క వ్రాసి పెడితే తప్పక మేలు పొందగలరు .
ప్రతి రోజు చాల దూరం నడుస్తూండటం వల్ల జబ్బులు రాకపోవడమే గాక శారీరక ధృడత్వం కూడా కలుగు తుంది .
జీవనం సరళం అయిపొతే సమయం ఎక్కువ మిగులుతుంది
 నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు . అట్టి స్థితిలో వేరే మతాలలో ఎలా చేరడం ?
న్యూ తెస్తమేంట్ లోని సెర్మన్ ఆఫ్ ది మౌంట్ భగవత్ గీత కు సాటి అనుకున్నా ను . "ఎవరు యెట్లు చేయుదురో వారు అట్టి ఫలమును అనుభవింతురు . కాని అన్యాయముతో అన్యాయాన్ని పార ద్రోలలేరు ఎవరైనా నీ కుడిచెంప మీద చెంప దెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప కూడా వాని వ్రైపు త్రిప్పు . ఎవరిని నీ ఉత్తరీయం లాగుకుంటే నీ అంతర్యం కూడా ఇచ్చివేయి " వాక్యాలు నాకు బాగా నచ్చాయి
 త్యాగమే ఉత్తమ మతమని నాకు తోచింది
 ఉపాయాలు అడుగింటి నప్పుడు , సహాయకులు వదిలివేసినప్పుడు , ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం . ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను భగవంతుడే రక్షించాడు .
స్తుతి , ఉపాసన , ప్రార్థన ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు . అవి ఆహార విహారాదుల కంటే కూడా అధిక సత్యాలు . అవే సత్యాలు
 రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం యెడ ప్రేమ అంకురించిన మాట నిజం .
తులసీ దాస్ రామాయణం సర్వోత్తమమైన గ్రంథం .
నా మనస్సు చెదిరినప్పుడు భగవత్ గీత నాకు ఎంతో సహాయం చేసింది , నాకు అది నిత్య పారాయణ గ్రంథం .
ప్రతి హిందువూ హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి .


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -04
పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేను ఎన్నడూ ప్రార్థించను . పాప కర్మ నుండి , పాప ప్రవ్రుత్తి నుండి విముక్తుడనగుటకు ప్రయత్నిస్తాను . అట్టి స్థితి చేకూరేదాకా నాకు అశాంతియే ప్రీతికరం .
యథార్థ విషయం అంటే సత్యం అన్నమాట .
సత్యాన్నిమనం గ్రహించినప్పుడు న్యాయం దానంతట అదే మనకు అనుకూలిస్తుంది.
సత్యం వజ్రం వలె క ఠోరం కుసుమం వలె కొమలం
 ఎచట ఉదారత , సహిష్ణుత , సత్యం ఉంటాయో అచట భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి .
 _మోహన్ దాస్ కరంచంద్ గాంధి.


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -05
ప్రజా సేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే నమ్మకంతోనే నేను సేవా ధర్మాన్ని స్వీకరించాను
 అప్పుతెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని నా అభిప్రాయం డబ్బు తప్ప మిగతా ఏ విషయాల్ని గురించిన ఏ వాగ్దానాలనైనా అంగీకరించవచ్చు.
ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం . లెక్కల్ని సరిగాను శుద్డంగాను ఉంచకపోతే సత్యాన్ని సరిగాను , శుద్ధంగాను రక్షించలేము
 ఏ మంచి పని అయినా సకాలంలో ఉపయోగపడితే అది తక్షణం ఆనందం కలిగిస్తుంది అది నా అనుభవం .
దంభంతో లేక పరభీతితో చేసే సేవ చివరికి అతన్నే అణచి వేష్టుంది .
ఏ సేవే హృదయానికి ఆనందం కలిగించదో అది సేవ చేసేవారికి , సేవ చేయించుకునే వారికి కూడా ఆహ్లాదం కలిగించదు.
సేవ ముందు భోగాలు , ధనోపార్జన మొదలుగాగల కోరికలన్నీ , తుచ్చమైనవిగా తోస్తాయి .
ప్రజల సేవ చేసేవారికి ఎన్నో కానుకలు వస్తాయి , కానీ అవి వారి సొంతం కాజాలవని నా నిత్చితాభిప్రాయం.
సేవా భావం , ప్రేమ భావం ఎప్పటికప్పుడు పుట్టుకురావు , దానికి అభ్యాసం కూడా అవసరం
 ధనం , బలం , మానం యివి మనుషులచేత ఎట్టి పాపాలనైనా , ఎట్టి అనర్థాలనైనా చేయిస్తాయి .


 గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -06
శిశువుకు విధ్యారంభం తల్లి గర్భంలోనే ఆరంభం అవుతుంది . గర్భధారణ సమయంలో తల్లి దండ్రుల శారీరక , మానసిక ప్రవృత్తుల ప్రభావం శిశువు నందు ప్రసరిస్తుంది .తల్లి గర్భం మోస్తున్నప్పుడు ఆమె ప్రకృతిని , ఆహార విహారాల్ని , గుణ దోషాల్ని శిశువు స్వీకరించి శిశువు జన్మిస్తుంది . జన్మించిన తరువాత తల్లితండ్రుల్ని అనుసరిస్తుంది .
మంచి ఏర్పాట్లు గల గృహాలలో పిల్లలకు విద్య అప్రయత్నంగా అబ్బినట్లు , హాస్టళ్ళలో ఉంచి చదివిస్తే అబ్బదు . తల్లి తండ్రుల సహవాస బలం వల్ల కలిగే అనుభవ జ్ఞానం పిల్లలకు చాలా అవసరం .
బ్రహ్మచర్యాన్ని సరిగా పాటించడం అంటే బ్రహ్మ దర్శనం చేసుకోవడమేనన్నమాట . బ్రహ్మచర్య వ్రతదారణం వల్ల శరీర రక్షణ , బుద్ధి రక్షణ , ఆత్మ రక్షణ కలుగు తుంది .
బ్రహ్మచర్య వ్రతం సాఫీగా సాగాలంటే ముందు జిహ్వ ను వశంలో పెట్టుకోవాలి . బ్రహ్మచారికి అడవిలో పండిన పండ్లు సరియిన ఆహారమని ఆరు సంవత్సరాలు కృషి చేసి తెలుసుకొన్నాను .
బ్రహ్మచారికి పాలు పనికిరావని , అవి బ్రహ్మచర్యానికి విఘ్నకారకమని చెప్పకతప్పదు . అయితే బ్రహ్మచారికి పాలు నిషిద్ధమని భావించద్దు
 మనస్సును నిగ్రహించడం , వాయువును నిగ్రహించడం కంటే కష్టం .


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -07
భోజనానికి సమయం దొరుకునట్లే వ్యాయామానికి సమయం దొరుకుతుందని నాటికి , నేటికి నా విశ్వాసం
 సంతలు , బజార్లు , మొదలుగుగాగల చోట్ల బిచ్చగాళ్ళకు కాణికూడా ఇవ్వకూడదని నేను నిశ్చయించుకొన్నాను .
గొర్రె ప్రాణం విలువ మనిషి ప్రాణం విలువ కంటే తక్కువ కాదు . మనిషి శరీరాన్ని పోషించేందుకు గొర్రెను చంపడం ఎన్నటికి అంగీకరించలేను .
చదువుకున్న వాళ్ళంతా మూడో తరగతి రైలు పెట్టెల్లో ప్రయాణించి , సాటి ప్రయాణికుల దురభ్యాసాలను తొలగింప చేసేందుకు కృషి చేయాలి .
తమ తమ సౌఖ్యాల కోసం లంచాలు ఇవ్వకూడదు . యితర అన్యాయమార్గాలు తొక్క కూడదు
 రోగానికి లంకణం పరమౌషధం అని నా భావం
 ఈ ప్రపంచంలో భగవంతుడొక్కడే సత్యం . మిగిలినదంతా అనిత్చితం . మన చుట్టుప్రక్కల కనిపించేది , జరిగేది అంటా అనిత్చితం . క్షణికం . దీనియందు నిత్చిత రూపమైన ఏ పరమ తత్వం విలీనమై ఉన్నదో దాని ప్రదర్శనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది . ఈ విషయం మీద నమ్మకం ఉంచితే మన జీవనం సార్థకం కాగలదు.


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -08
భీమా చేయించడంలో కొంచం పిరికితనం , ఈశ్వరునిపై అపనమ్మకం పని చేస్తుందని నా అభిప్రాయం
 సంస్కృత గీతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం మొదలుపెట్టి , ఎదురుగా ఉన్న గోడ మీద గీత శ్లోకాలు అంటించి సమయం దొరికినప్పుడల్లా వాటిని బట్టీవేయడం ప్రారంభించినాను . భగవద్ గీత నా ఆచారానికి సంభందించిన ప్రౌఢ మార్గ సూచిక అయ్యిందని చెప్పగలను.
కొత్త ఇంగ్లీషు శబ్దాల స్పెల్లింగులు లేక వాటి అర్థాలు తెలుసుకొనేందుకు ఇంగీషు నిఘంటవు చూసినట్లే , ఆచరణకు సంభందించిన కష్టాలు కొరుకుడుపడని సమస్యలు వచ్చినపుడు గీత ద్వారా వాటి పరిష్కారం చేసుకోనేవాన్ని .
అపరిగ్రహి కావడానికి , సమభావి కావడానికి హేతువు యొక్క మార్పు , హృదయం యొక్క మార్పు అవసరమను విషయం గీతాధ్యయనం వల్ల దీపపు కాంతిలా నాకు స్పష్టంగా కనబడింది .
సంస్కరణలకు సంభందించిన పనుల్లో కూడా శక్తికి మించి పాల్గొనడం మంచిది కాదు . అప్పులు ఇవ్వడం , తీసుకోవడం గీత భోదించిన తటస్థ నిష్కామకర్మ విధానానికి విరుద్ధ మని తెలుసుకొన్నాను .
జీవితంలో నిరాడంబరత పెరిగిన కొద్దీ , రోగాలకు మందు పుచ్చు కోవడమంటే అయిష్టత కూడా పెరిగింది .
క్షణ క్షణం డాక్టర్ల దగ్గరికీ , వైద్యుల దగ్గరికీ , హకీముల దగ్గరికీ పరుగెత్తుతూ ఉదరంలో రకరకాల రసాయనం పోసి పోసి మనిషి తన జీవితాన్నితానే కుచించు కొంటున్నాడు , అంతే గాక మనస్సు మీద అతనికి గల పట్టు తప్పుతున్నది . దానితో అతడు మానవత్వం పోగొట్టుకొంటున్నాడు . శరీరానికి బానిస అయిపోతున్నాడు .

గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -09
మనిషి , అతడు చేసే పనులు రెండూ వేరు వేరు వస్తువులు . మంచి పనుల వలన ఆదరణ , చెడ్డ పనుల యెడ నిరాదరణ అవసరం .
మంచి పనులు , చెడు పనులు చేసే వారిద్దరి యెడ ఆదరణ , దయ కలిగి ఉండాలి . దీన్ని తెలుసు కోవడం తేలికే కాని ఆచరణలో పెట్టడం అంతతేలిక కాదు . అందువల్లనే ప్రపంచంలో విష వాతావరణం వ్యాప్తం అవుతూ వుంటుంది .
సత్య శోధనకు మూలంలో వున్నది అహింసయే . ఈ అహింస కరతలామలకం కానంతవరకు సత్యం లభించదను విషయం ప్రతిక్షణం గ్రహిస్తూ వున్నాను .
ఆస్తికులగు మనుష్యులు తమలో గల భగవంతున్ని సర్వులలో చూడగలిగి అందరితోనూ నిర్లిప్తంగా ఉండగల శక్తిని అలవర్చుకొని ఉండాలని నా అభిప్రాయం .
ఎక్కడ వెతకకుండా అవకాశాలు లభిస్తాయో , అక్కడ వాటికి దూరంగా పారిపోకుండా క్రొత్త క్రొత్త సంభంధాలు ఎర్పరుచుకోన్నప్పుడు , అలా చేస్తూ రాగ ద్వేషాలకు దూరంగా వుండకలిగి నప్పుడు శక్తిని వికసింప చేసుకోగలుగుతాము .
మనం అనుకునేది ఒకటి , జరిగేది మరొకటి అను విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకొన్నాను . దానితో పాటు సత్యశోధన ఉపాసన సాగినప్పుడు , మనం కోరుకొన్న ఫలితం కలుగక , ఊహించని ఫలితం కలిగితే దానివల్ల నష్టం కలుగదని , ఒక్కక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది .

గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -10
బిడ్డలకు రూపు రేఖలు వారసత్వంగా లభించినట్లే వారి గుణ దోషాలు కూడా తప్పక లభిస్తాయి . అట్టి దోషాల నుండి కొంతమంది పిల్లలు తమను తాము రక్షించు కుంటూ ఉంటారు . అది ఆత్మ స్వభావం . అట్టివారికి అభినందనలు .
బాల్యం నుండే తమ పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించేందుకు తంటాలు పడే తల్లి తండ్రులు తమకు , తమ దేశానికి ద్రోహం చేస్తున్నారని నా నిత్చితాభిప్రాయం . ఇందువల్ల పిల్లలు తమ దేశ ధార్మిక సాంఘిక వారసత్వం నుండి వంచితులవుతారని నా అభిప్రాయం .
మంచి నడత అంటే శీలం ప్రధానమైనదని భావించాను . పునాది గట్టిగా ఉంటే తరువాత పిల్లలు ఇతరుల ద్వారానో లేక తమంత తాముగానో నేర్చుకోగలరని నా అభిప్రాయం .
తల్లి దండ్రులు జాగ్రత్త పడితే పిల్లలు చెడ్డ వారి సహవాసం చేసి కూడా చెడిపోరని , మంచివారిమీద చెడు యొక్క ప్రభావం పడదని నా అభిప్రాయం .
ఇతరుల కంటే తాము గొప్ప వారమనే భావం పిల్లలలో బాల్యం నుండే నేర్పడం తగదు . ఇట్టి భావం వారి బుర్రలో కలిగించాడమంటే వాళ్ళను చెడు మార్గంలో ప్రవేశపెట్టడమే కదా !


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -11
ఉపాధ్యాయులు తాము చేసిన పనులే పిల్లలకు నేర్పాలని , తాము చేయని పనులు పిల్లలచేత చేయించకూడదని నా అభిప్రాయం . ఇది మా టాల్ ష్టాయ్ ఆశ్రమంలో నియమం , అమలు చేసాం .
పిల్లలకు వాళ్ళ మాతృబాషలో చదువు నేర్పాలని మా నిర్ణయం
 పిల్లలలో సోమరితనం పోగొట్టి , చదవడానికి వాళ్ళను ప్రోత్సహించడం , వాళ్ళ చదువును గురించి శ్రద్ధ వహించడం మా స్కూల్ లో నా పని . దానితో నేను త్రుప్తిపడేవాడిని
 వాస్తవానికి పిల్లవాడికి నిజమైన పాఠ్య పుస్తకం ఉపాధ్యాయుడే .
పిల్లలు తమ తమ మతాల మూల తత్త్వం తెలుసుకోవడం , తమ మత గ్రంథాలను గురించి కొద్దిగా నైనా వాళ్ళు తెలుసుకోవడం అవసరమని భావించాను .
ఆత్మ శిక్షణ ఉపాధ్యాయుని నడత , శీలం వల్లనే విద్యార్థులకు అలవడుతుంది .
అందువల్ల ఉపాధ్యాయులు కడు జాగురూకులై వ్యవహరించడం అవసరం . ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా విద్యార్థుల హృదయాలను కదిలించగలడు
 పిల్లలను కొట్టి పాఠాలు చెప్పడానికి నేను వ్యతిరేకిని.


 గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -12
సత్యాన్ని పాటించడంవల్ల క్రోధం , స్వార్థం , ద్వేషం మొదలుగాగలవి సహజంగా తగ్గిపోతాయి . అవి తగ్గక పొతే సత్యం గోచరించదు
 శుద్దమైన సత్య శోధన జరపడమంటే రాగాద్వేషాదుల నుండి విముక్తి పొందడమే .
సత్యనిష్ఠ గలవారు , నియమాల మీదనే ఆధారపడి పనిచేయ కూడదు . తన భావాల్ని మాత్రమే అంటి పెట్టుకొని ఉండకూడదు . అందు దోషం ఉండవచ్చని అంగీకరించాలి . ఆ దోషాన్ని గురించి పరిజ్ఞానం కలిగిననాడు యెంత పెద్ద ప్రమాదం సంభవించినా ఎదోర్కొనాలి . దాని ఫలితం అనుభవించాలి . ప్రాయత్చిత్తం కూడా చేసుకొనేందుకు సిద్ద పడాలి .
ఎవరికైనా వ్యతిరేకంగా వ్యవహరించ దలచుకొన్నప్పుడు ఆ విషయం వారికి తెలిపి వారి అభిప్రాయం తెలుసుకోవడం , సాధ్య మైనంతవరకు వారికి అనుకూలంగా వ్యవహరించడం సత్యా గ్రహి ధర్మం .
కర్తవ్య భోధ దీపం వెలుగులా స్పష్టంగా ఉండదు కదా ? సత్య పూజారి అనేక సార్లు మునిగి తేలవలసి వస్తుంది .


గాంధీజీ ఆత్మకథ సత్యశోధన నుంచి పరిశీలనలు -13
వినమ్రతకు పూర్తీ అర్థం శూన్యత్వం . శూన్యత్వాన్ని పొందడం కోసం యితుర వ్రతాల్ని అనుష్టించాలి . వాస్తవానికి శూన్యత్వం మోక్ష స్తితియే
 వేరు వేరు మతాలూ ఉన్నంతవరకు ఆ మతాలవారికి బాహ్య చిహ్నాలు బహుశా అవసరం అవుతాయి . కాని ఆ భాహ్య చిహ్నాలు ఆడంబరంగా మారినప్పుడు, తన మతమే యితుర మతాల కంటే గొప్పదని చెప్పుటకు సాధనాలుగా మారినప్పుడు వాటిని త్యజించడం మంచిది .
నేను మొదట ఏమి చేయడలచుకొనే వాడినో ఈశ్వరుడు దాన్ని సాగని చ్చేవాడు కాదు . తానొకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు నా విషయంలో జరుగుతూ ఉంది . భగవంతుడు నా కోరికల్ని అనేకసార్లు పూర్తీ కానీయ లేదు . నేను అనుకొన్నది ఒకటి అయింది మరొకటి . దేవుడు నన్ను మరో పనికి వినియోగించాడు .
అన్నిటికి ఆ సత్య రక్షకుడు ఆ భగవంతుడే ! భగవంతుడే నా ప్రార్థనలను ఆలకించాడని నా నమ్మకం . ఆ నాటికి , ఈ నాటికి అదే నా నమ్మకం
 సత్య శోధనలో ఇబ్బందులకు నేను అలవాటు పడిపోయాను . ప్రతిసారి చివరి నిమిషంలో దేవుడే ఆదుకొనేవాడు .
 _మోహన్ దాస్ కరంచంద్ గాంధి .