5, జులై 2015, ఆదివారం

త్రివిక్రమ్ అద్బుతాలు...


గొంతులో ఉన్న మాట ఐతే నోటితో చెప్పగలం
కానీ మనసు లో ఉన్న మాట........
కేవలం కళ్ళతోనే చెప్పగలం.
- నువ్వే కావాలి (2000)

వాయసై పోయిన హీరోలు అందరు,
రాజకీయ నాయకులు అయినట్టు...
ఫేల్ అయిన లవర్స్ అందరు ఫ్రెండ్స్ అయిపోలేరు.
- చిరునవ్వుతో (2000)

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు,
ఓడిపొయినప్పుడు భుజం తట్టే వాళ్ళు,
నలుగురు లేనప్పుడు, ఎంత సంపాదించిన,
ఎంత పోగొట్టుకున్న తేడా ఏమీ ఉండదు
- నువ్వు నాకు నచ్చావ్ (2001)ఆడపిల్లలు, ఎంత తొందరగా ప్రేమిస్తారో
అంత తొందరగా మర్చిపోతారు............
- మన్మధుడు (2002)

పనిచేసి జీతం అడగొచ్చు,
అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు,
కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగ కూడదు.
- మల్లీశ్వరి (2004)

నిజం చెప్పక పోవడం అబద్దం...
అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
నేను పార్థు అని అబద్దం చెప్పాను.
నేనే పార్థు అని మోసం చేయలేదు.
అందుకే ఎవరు అనుమానించినా సహించాను,
ఎవరు అవమానించిన భరించాను,
ఎవరు ప్రేమించిన తలొంచాను.
- అతడు (2005)

సూర్యుడి చుట్టూ భూమీ, భూమి చుట్టూ చంద్రుడు,
చంద్రుడి చుట్టూ కవులు... నాలా కాలిగా ఉన్న వాళ్ళు తిరుగుతారు,
ఆది సైన్స్. అమ్మాయి చుట్టూ అబ్బాయి తిరిగితే ఆది రొమ్యాన్స్...
- జల్సా  (2008)

అద్బుతం జరిగినప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు...
జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
- ఖలేజా (2010)

ఆశ క్యాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది...
కానీ భయం, అల్సర్ ఉన్నోడిని కూడా ఛంపేస్తుంది.
- జులాయి (2012)

ఎక్కడ నెగ్గాలో కాదురా,
ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు.
- అత్తారింటికి దారేది (2013)

మనం బావునప్పుడు లెక్కలు మాట్లాడి
కష్టాలో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు...
- s/o... సత్యమూర్తి (2015)