19, జులై 2015, ఆదివారం

మాన‌వాళికి ప్ర‌కృతి అందించిన మ‌హా కానుక గోదార‌మ్మ‌..

మాన‌వాళికి ప్ర‌కృతి అందించిన మ‌హా కానుక గోదార‌మ్మ‌.. నిజంగా గోదావ‌రిని చూస్తే ఒక్కొక్క‌సారి ఒక్కోలా క‌నిపిస్తుంటోంది. ఒక సారి ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో అంతే స్థాయిలో రౌద్రాన్ని చూపిస్తుంది. నీలి ఆకాశాన్ని త‌ల‌పించే గోదావ‌రి సూర్యోద‌య స‌మ‌యంలో బంగారుపు వ‌ర్ణంలో క‌నిపిస్తుంటోంది. క‌వులు..ర‌చ‌యితలు.. గోదారి అందాల‌ను ఎంత పొడిగినా త‌నివి తీర‌దు. ప‌ర‌మ ప‌విత్రంగా భావించే గోదావ‌రిని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మ‌హాశ‌క్తి అబ్బుతుంద‌ని భావిస్తుంటారు.