23, జులై 2015, గురువారం

ఈ దేశము మనది. మన అందరిది.మంచి,రోజులు రాబొతున్నాయి !!


ఈ దేశము మనది. మన అందరిది.మంచి,రోజులు రాబొతున్నాయి !! మొదలైంది మరో స్వతంత్ర సంగ్రామం .దాని లో మనం అంతా సైనికులమే.. మన హక్కుల తో పాటు భాద్యతలను సైతము తెలుసుకొందాము. మన దేశ పరిస్థితులను చక్కదిద్దుకోవటములో మనము అందరమూ సైనికులమే.!! మన చుట్టు ప్రక్కల, మన ఎదురు గా కనిపిస్తున్న సమస్యలను సరి చేసుకొంటూ ముందుకు కదలటమే మన కర్తవ్యము
 పెద్దలు సమాజ శ్రేయోభిలాషులు అయిన గంగాధర తిలక్ కాట్నం
 గారి అమూల్యమైన అభిప్రాయం వారి మాటల్లో వినండి.
ఈ సంగ్రామం లో కత్తులు పట్ట నవసరము లేదు కదన రంగములో లో ప్రవేశించ నవసరము లేదు. Pen and vote are powerful than weapons . Let's use them with more skills.Gangadhara Tilak Katnam For most of the problems in our society,Every one of us are responsible. Join together to rectify the evils.అవధులు దాటిన స్వార్ధమనం ఉంటున్నదే ఒక మాయామేయ జగంబులో ....ము ఒక ప్రక్క, అర్ధము లేని అసూయ ఇంకొక ప్రక్క
 ఈ దేశము ఏమైతే నాకేమిటి....నాకు అప్పనముగా ఒక వంద రూపాయల ఇచ్చిన వాడే మహా నాయకుడు అనే సోమరి జనము .....బానిస ఆలోచనలు యువతరము మేల్కొంటోంది... .!!స్వాతంత్ర ఫలములు సామాన్యునుకి అందించటమే ఈ సంగ్రామం యొక్క ముఖ్య ఉద్దేశము. మన పూర్వీకులు అనేక కష్ట నష్టములకు ఓర్చు కొని , తమ ప్రాణాలను సైతముతృణ ప్రాయముగా భావించి మనకు స్వాతంత్రము సాధించి పెట్టేరు.అట్టి స్వాతంత్రమును పదిలంగా కాపాడు కొనుట మన కనీస భాద్యత. నిధులు లేవనే సాకును ప్రక్కన పెడదాము.మన విధులను సక్రమంగా గా పాటించి మన తోటి వారికి మార్గదర్శకుల మౌదాము. ఎవరు చేయగలిగిన ప్రయత్నము వారు చేద్దాము.మన భారత దేశ పూర్వపు వైభవాన్ని తిరిగి సాధించుకొందాము.సోమరి తనాన్ని తరిమి కొట్టండి. స్వార్ధాన్ని కొంచెము ప్రక్కన పెట్టండి.స్వామి వివేకానందుల వారి ప్రభోధములు మననం చేసు కొనండి.ధైర్యము-దేశభక్తిల తో మన మనసులు నింపుకొందాము. ప్రశ్నించవలసిన చోట, తల దించుకొని ప్రక్క నుండి వెళ్ళి పోవటము మంచితనము లో భాగము కాకపోవచ్చు