29, జులై 2015, బుధవారం

నీ కలే కంటాం !...

నీ కలే కంటాం !...
నిత్య నూతన ఆవిష్కరణల కృషీవలుడా! !.
నీ కిష్టమైన నీలాకాశంలోకి...ఆ వింతల విశ్వంలోకి....పయనమై పోయావా! !??...మాకు తెలుసు....నీ కక్కడ ప్రత్యేక. ఆసనాలుంటాయని!
దేవుని పక్కన సిమ్హాసనం...నీలాకాశంలో మరో దేదీప్యమాన సితార స్దానం!...విశ్వంలోని గ్రహ కూటములన్నీ నీకు పల్లకిగా మారగలవని!
దేశపు కీర్తికిరీటంలో కాన్తులీనే కలికితురాయివి.! మాకందరికీ స్ఫూర్తి దారివి!నీ కెన్ని బిరుదులు సరి!!..నీ కెన్ని సింహాసననాలు మరి!!.
కలాం బాబూ..దేశ భవిత యువతకు స్పూర్తి ఊపిరిలు అందిస్తూనే..ఊపిరొదిలిన మా తండ్రీ!....నీ వెళ్లిన విశ్వంలోని అంశాలని ....మానవాళికి పంపించు.విద్యార్ధులంతా భూమి మనుగడను కాపాడే శాస్త్రవేత్తలయేలా దీవించు.!...
మళ్లీ మరో జ్ఞానివై భారతజాతి కే జన్మించు!..మా చేయి విడువకు!..
చూసావా మేమంత స్వార్ధపరులమో!..నీవు విశ్రాంతి కెళ్ళినా "వరాలడుగుతూనే"ఉన్నాం.!..
మరి దేవుని కేగా..జనుల కోరికలు తీర్చే దమ్ము! ...
కలలు కనమని పిలుపు నిచ్చావ్.మా కలలొకొచ్చే ఘనులెవరు??!!..
నీ కలలేకంటాం!!.....మళ్లీ మాపిల్లల కోసం...వారి లో ఫైర్ కోసం ..మీరు తిరిగి పుట్టాలని.!!.