29, జులై 2015, బుధవారం

మళ్లీ వస్తా రా మహానుభావా... ....


మళ్లీ వస్తా రా మహానుభావా... ....
సత్యం ఆగిపోయింది ...
ధర్మం నిలిచిపోయింది ...
శాంతి అదృశ్యమైంది.
నీతి, నిజాయితీ ఆవిరయ్యింది.
మార్గం చెప్పే వాక్కు మూగబోయింది ..
మంచితనం తనువు చాలించింది....
భరతఖండపు జాతికి వెలుగునిచ్చిన కాంతిపుంజం
 రాలిపోయింది...
విశ్వ ఖ్యాతి గడించిన భారత మిసైల్ గగనానికి ఎగిసింది...
అఖండ జ్ఞానతేజం దివాకరునిలో ఏకమయ్యింది.
ముద్దు బిడ్డ ఇక లేడని భరతమాత కంట నీరు పెట్టింది .
మీరులేరనే బాధ వెంటాడుతున్నా...
మీరు చేసిన చివరి పయనం నన్ను ఆలోచనలోకి నెట్టి వేసింది.
మహత్తరమైన రోజు తొలిఎకాదశి నాడు
 సూర్యుని కి తోడుగా ఒకే సమయమే
 మీరు అస్తమించడం విశేషం.
ఇది భగవత్ స్వరూపులకేసాధ్యం.
మహానుభావా..
మీ స్వరూపం పురుష తత్వం..
మీ శిర సిగపై మధ్య పాపట స్త్రీ తత్వం.
మీ కల్మషం లేని మనో రూపం బాలతత్వం
 మొత్తంగా కలగలిపి మూర్తిభవించిన ఈశ్వరతత్వం.
మీ పాదాలు తాకలేక పోయాయి నా కరములు..
ఎన్నో విధాలుగా ప్రయత్నిచా..
దర్శించే భాగ్యంలేకపోయింది .
నా కోసం అంటూ మీరు ఒక సమయం ఇచ్చినా
 కలవలేని దురదృష్ట వంతున్ని ....
నాజీవితం లో నేను ఏదైనా కోల్పోయాను అంటే
 ఇదే ....
మళ్లీ వస్తా రా మహానుభావా... ....
కాలం విలువ రాసిన కలమా...
గురువై ఆదర్శంగా నిలిచినా కలామా ...
2020 చూడకుండా వెళ్ళారే..
నాలోని ఆవేదన సంద్రాన్ని ఎంతని చెప్పడం
 ఎలా అని చూపటం ...
ఇంతకన్నా నేను ఏమి చెప్పను ... చెప్పలేను ...