29, జులై 2015, బుధవారం

కలాం ‘మై జర్నీ-ట్రాన్స్‌ఫార్మింగ్‌ డ్రీమ్స్‌ ఇన్‌ టు యాక్షన్‌ పుస్తకం నుంచి

కొన్ని తరాల క్రితం.. రామనాథ స్వామి విగ్రహాన్ని కాపాడటం కోసం మా ముత్తాత ఒకరు చేసిన సాహసం గురించి చిన్నప్పుడు మా నాన్న మాకు ఎప్పుడూ చెప్తుండేవారు. అదేంటంటే.. ఉత్సవాల రోజుల్లో ఒకరోజు ఉత్సవ మూర్తులను రామేశ్వరం గుళ్లో నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ ఆవరణలో తిప్పుతున్నారు. గుడి చుట్టూ బోలెడన్ని కోనేరులుండేవి. ఒకసారి ఉత్సవమూర్తి పొరబాటున ఒక కోనేటిలో పడిపోయింది. అపచారం జరిగిపోయిందన్న భయంలో అందరూ నిశ్చేష్టులైపోయారు. కానీ.. మా ముత్తాత మాత్రం ఆ సమయంలో చేష్టలుడిగి నిలబడిపోక క్షణాల్లో ఆ కోనేటిలోకి దూకి విగ్రహాన్ని బయటకు తీశారు. అంతే.. అందరూ ఆయన్ను ఎంతగానో అభినందించారు. ఒక ముస్లిం అయినప్పటికీ వారెవ్వరూ ఆయన్ను ఆక్షేపించలేదు సరికదా.. ఓ గొప్పవాడిలా కీర్తించారు. అంతేకాదు.. ఆనాటి నుంచి ఆలయంలో ఆయనకు తొలి మర్యాద (ముదల్‌ మరియాదై) అందుకునే హక్కు ఉందని తీర్మానించారు. దాని ప్రకారం గుడిలో ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా ఆయనకు అగ్ర ప్రాధాన్యమిచ్చేవారు. అది కొన్ని తరాలు సాగి మా నాన్నకు కూడా ఆ మర్యాద లభించేది. ఈ మతసామరస్యం ఎన్నో తరాలపాటు కొనసాగింది. మా నాన్న నడిపే పడవను ఆలయ సేవలకు కూడా వినియోగించేవారు. (కలాం ‘మై జర్నీ-ట్రాన్స్‌ఫార్మింగ్‌ డ్రీమ్స్‌ ఇన్‌ టు యాక్షన్‌ పుస్తకం నుంచి)