19, జులై 2015, ఆదివారం

మన గోదావరితల్లి


గోదావ‌రి నాసిక్‌లో పుట్టి అంత‌ర్వేది ద‌గ్గ‌ర‌ స‌ముద్రంలో క‌లుస్తుంది. అంత‌టా ప‌శ్చిమ నుంచి తూర్పు నుంచి ప్ర‌వ‌హిస్తుంటుంది. ల‌క్ష్మీపాలెం అనే గ్రామం ద‌గ్గ‌ర మాత్ర‌మే తూర్పు నుంచి ప‌శ్చిమ వైపు ప్ర‌వ‌హిస్తుంది. కాశీ వాస్తు ఎలా ఉందో ల‌క్ష్మీపాలెం వాస్తు అలాగే ఉండ‌డం, గంగా న‌ది ప్ర‌వాహ తీరు.. గోదావ‌రి తీరు ఒకేలా ఉండ‌డంతో ల‌క్ష్మీపాలెం గ్రామాన్ని ద‌క్షిణ కాశీ అని పిలుస్తారు. అందుకే ఇంత‌టి ప‌విత్రమైన ప్రాంతంలో వ‌శిష్ఠ మ‌హామునితో స‌హా అనేక ముంది రుషులు త‌ప‌స్సు చేసేవార‌ని చ‌రిత్ర చెబుతోంది. రుషులు త‌పస్సు చేసిన గుహ కూడా ఇప్ప‌టికీ భ‌ద్రంగా ఉంది.