17, జులై 2015, శుక్రవారం

పుష్కరాలు మన దేశంలోని నదులకే వస్తాయా?

కొందరి అనుమానం పుష్కరాలు మన దేశంలోని నదులకే వస్తాయా? వేరే దేశ నదులకు రావా?...నిజానికి మన భారతీయ సనాతన ధర్మ విజ్ఞానం శాస్త్రీయ ధృక్పధంతో ముడి పడి ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది అని కనిపెట్టిన ఋషులు మీకర్ధమయ్యే పరిభాషలో చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రజ్ఞులు.భూమి గుండ్రంగా కొన్ని కోణాలను కలిగి వుంటుంది.వీటినే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ లో కొలుస్తారు కదా!గురువు ఇన్ని డిగ్రీల ప్రదేశ్ ఆవృతంలో ఉంటే ఆ ప్రదేశంలో ఉన్న నదికి పుష్కరాలు వస్తాయి.నిజానికి ఆయా డిగ్రీల ప్రదేశాలలో ఉన్న ఏ నది కైనా పుష్కరాలు వస్తాయి. మన భారతీయ ఋషుల విజ్ఞాన పుణ్యమా అని మనకు సులువైన పంచాగం ఇచ్చారు.ఈ లెఖ్ఖలు జ్ఞానపరంగా అభివృద్ధి సాధించిన మన భారతీయుల సొంతం. అక్కడ ఇతర దేశీయులకు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అంతగా లేనందున ఇది వారికి తెలియలేదు.ఆయా నదీపరివాహక ప్రాంతాలలోని ప్రజలు ఆసమయంలో ప్రవహించే ఔషధీ నదీస్నానం వల్ల నూతనోత్తేజం పొందుతారు.నిజానికి ఇది మానసిక శుద్ధి ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్న విధానం. కాని ఇలా సైన్సు చెప్పిందంటే ఆచరించటం కన్న పుణ్యం వస్తుందంటే ఆచరించే వారు ఎక్కువశాతం ఉన్నందున అలా నిర్ణయం చేశారు మహనీయులు.అంతేకాదు కొన్ని కులాలలో చనిపోయిన వారికి ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రాద్ధ విధాన వైదిక పరిజ్ఞానం లేనందున వారు పెద్దలకి కృతజ్ఞత చూపే రోజులుగా కూడా నిర్ణయించారు. ఇది కూడా విడ్డూరమైనదేమీ కాదు.విదేశాల్లో కూడా సంవత్సరంలో ఒక 3 రోజులు ప్రజలందరూ తోచిన దెయ్యపు బట్టలను వేసుకుని వీధుల్లొ తిరుగుతారు.అది వారి పద్ధతి.ఇది మన పద్ధతి.ఇంక సౌర కుటుంబంలో ప్రతి రోజూ చలనాలు ఉంటాయి కదా! అలా డిగ్రీలు మారినప్పుడల్లా ఆ యా డిగ్రీలలో ఉన్న ప్రపంచంలోని నదులన్నింటికీ ఒక్కోసంవత్సరం పుష్కరాలు వస్తాయి.మనకు మనదగ్గరున్న నదుల వరకే ఈ లెఖ్ఖలు వేస్తాలు పండితులు.
ఇక పుష్కరుడు ఘాట్ దగ్గర మాత్రమే ఉండడు.నదీ తీరం మొత్తంలో ఎక్కడైనా స్నానం చేయవచ్చు. కాని ప్రజలు ఘాట్ ల దగ్గరే స్నానానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే నదీ లోతు యే ప్రదేశంలో ఎంత ఉందో తెలియదు కాబట్టి,అందరికీ ఈత రాదు కాబట్టి అక్కడ కొంత భద్రత ఉంటుందన్న విశ్వాసంతో ఘాట్ లల్లో మాత్రమే స్నానానికి వస్తారు. కాని ఇక్కడ చేస్తేనే పుణ్యం వస్తుంది అన్న రీతిలో ప్రచారం జరగటం వల్ల కొన్ని కుటుంబాలు వీధిన పడవలసి వచ్చింది. ఇది నిజంగానే దురదృష్టకరం.