29, జులై 2015, బుధవారం

కలాం జీ మీకిదే మా అంతిమ వీడ్కోలు...

పాడు చావుకి కన్ను కుట్టింది..
మంచితనానికి సంధికొట్టింది..
నిజాయితీకి పొద్దుకూకింది..
కటికచీకటి వెలుగుని మింగింది..
కలాం కాలం ఛాలించి
 తొందరపడి వెళ్ళిపొయావా?
అర్థవంతపు బ్రతుకునావకు
 అర్థాంతరంగా తెరనుదించావా?
కుటిల జగతితొ పొరి పొరి అలసిపొయావా?
ఇకమార్పు రాదని అలిగిపొయావా?
అదుపు తప్పిన అనారోగ్యం
 అంతకునివలే చెంత చేరిందా?
ప్రగల్భాలు పలుకలేదు
 ప్రచారాన్ని కొరలేదూ
 పనియే పరమావదిగా
 కనిపించని పునాదిగా
 పయనించిన క్షిపణిగామివి..
మనసులోని మూగభాధను
 ఎవరితొ ఏకరువు పెట్టనూ?
దూరతీరం వెల్లినావా
 ఎన్నడు ఇక తిరిగిరావా?
తెలిసిన వ్యక్తి ఇక లేరు ఇక ముందు వింటుంటే చాలా బాధగా ఉంది..
 "WINGS OF FIRE" అని తన చరిత్ర రాసి జీవితంలో ఎలా ఎదాగాలి అని చూపించారు.
ఓ స్ఫుర్తిదాత మళ్లీ పుడతావా....??
మీ స్పూర్తి ని కొనసాగిస్తూ నవతరం యువరక్తం ఉడుకు నెత్తురు జ్వాలను ఆరనివ్వక మమ్మల్ని మీ మాటలే ఉత్తేజపరచాలని భావిస్తూ..
మీకిదే మా అంతిమ వీడ్కోలు...