29, జులై 2015, బుధవారం

మహాత్మునికి కన్నీటి వీడ్కోలు. ..

మహాత్మునికి కన్నీటి వీడ్కోలు. ..
ఓ జ్ఞానీ....చిరంజీవీ...
కలలు కన్న ఆ కళ్లు రెప్పలు వాల్చితేనేమి,
ఆ కలలు వెలుగులు ప్రసరిస్తూనే వుంటాయ్...
ఆ వెలుగులు దారి చూపుతూ నే వుంటాయ్...
ఈ జాతికి మీరు ఎన్నటికీ గురువులు. మార్గదర్శకులు..
ఓ అస్త్ర మునీ .ఓ శాస్త్ర జ్ఞానీ ఎన్నటికీ మీరు చిరంజీవులు. .
మీ ఆత్మకు శాంతి చేకూరాలని
 ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తూ..
మల్లీ మన భారతావనిలో మీరు జన్మించాలని
 మన జాతికి మార్గదర్శనం చెయ్యాలని ఆ పరమాత్ముని
 వేడుకొంటూ ......
అశ్రునయనాలతో శెలవ్ మహాత్మా....