28, జులై 2015, మంగళవారం

నేను అచ్చమైన, స్వచ్చమైన భారతీయ యువకున్ని

మన భారతదేశం


I am the Indian - నేను భారతీయ యువకున్ని


 చచ్చిపోను నేను చవట సన్నాసిలా,
బతకను నేను చేతకాని దద్దమ్మలా...


నింగి అంచును చేరుకుంటా నా కాళ్ళతో,
చందమామను అందుకుంటా నా చేతులతో.


మద్యం మత్తుకు బానిసను కాను,
డబ్బుకు లొంగను నేను.


కొండనైన పిండి చేస్తా, నా కండ బలంతో,
బండనైన కరిగిస్తా, నా బుడ్డి బలంతో.


మనిషిని మారుస్తా నా మాటలతో,
మనసును గెలుస్తా నా మనసుతో.


ఉగ్రవాది కాదు నేను, ఉన్మాది కాదు నేను,
పైశాచిని కాదు నేను, తీవ్రవాది కాదు నేను,


అచ్చమైన, స్వచ్చమైన భారతీయ యువకున్ని.
పదిమందికి సాయం చేస్తా,
వందమందికి ఒక్కడినవుతా.
సహనంతో సాధిస్తా,
నేర్పుతో నేగ్గుకోస్తా.


భారతీయుడుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం.


జైహింద్
.