9, జులై 2015, గురువారం

రఘుపతి రాఘవ రాజారామ్


రఘుపతి రాఘవ రాజారామ్ అనునది హిందూ మతానికి చెందిన ఒక ప్రముఖ భక్తి గీతం, ఈ గీతం మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన గీతo. విష్ణు దిగంబర్ పలుస్కర్ ఈ గీతానికి చాలా సాధారణమైన సంగీతాన్ని సమకూర్చారు మరియు ఉప్పు సత్యాగ్రహం సమయంలో దండి వరకు 241 మైలు నడిచినటు వంటి సందర్భాలలో గాంధీ మరియు అతని అనుచరులు ఈ గీతాన్ని ఆలపించారు.

రఘుపతి రాఘవ రాజారామ్
 పతిత పావన సీతారామ్
 ఈశ్వర అల్లా తేరేనామ్
 సబ్ కొ సమ్మతి దే భగవాన్

హిందీ
रघुपति राघव राजाराम,
पतित पावन सीतारामसीताराम सीताराम,
भज प्यारे तू सीतारामईश्वर अल्लाह तेरो नाम,
सब को सन्मति दे भगवान

వాస్తవ సాహిత్యం
రఘుపతి రాఘవ రాజారామ్పతిత పావన సీతారామ్సుందర విగ్రహ మేఘశ్యామ్గంగ తులసి సాలగ్రామ్భద్ర గిరీశ్వర సీతారామ్భక్త జనప్రియ సీతారామ్జానకి రమణ సీతారామ్జయ జయ రాఘవ సీతారాంజయ రఘునందన జయ సీతారామ్జానకి వల్లభ సీతారామ్"కొన్నిసార్లు చివరి రెండు వరుసలు కలుపుతారు":

కొన్ని సార్లు ఈ క్రింది విధంగా చదువుతారు.
जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम