4, ఆగస్టు 2015, మంగళవారం

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 41755  :మనం నేడు వాడుతున్న "పెన్సిలు" ను కనిపెట్టిన నికోలస్ జాక్వె కోంటె జననం (మ.1805).
1777: రిటైర్ అయిన బ్రిటిష్ సైనిక దళం అధికారి ఫిలిప్ ఆష్లే, మొదటిసర్కసు ను ప్రారంభించాడు.
1929 : ప్రముఖ హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ జననం (మ.1987).
1948 : తొమ్మిది, పది మరియు పన్నెండవ పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎన్నికైన నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు జననం.
1954 : భారత లోక్ సభ సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు నాయకుడుఉండవల్లి అరుణ కుమార్ జననం.
1960 : భారతీయ చిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ రచయిత, సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు విశాల్ భరద్వాజ్ జననం.
1961 : అమెరికా 44వ అధ్యక్షుడుబరాక్ ఒబామా జననం.
1967 : నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
1971: అమెరికా, మనుషులు ఉన్న అంతరిక్షనౌక నుంచి, మొదటి సారిగా ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.