2, అక్టోబర్ 2015, శుక్రవారం

కోనసీమ...ఆ పేరు వినగానే పచ్చతనం గుర్తుకు వస్తుంది

కోనసీమ...ఆ పేరు వినగానే పచ్చతనం గుర్తుకు వస్తుంది. ఠీవీగా తలెత్తుకుని ఆకాశాన్ని సవాలు చేసే కొబ్బరి చెట్లూ, పచ్చని చీర గట్టి వయ్యారాలు పోయే ప్రకృతి కాంతలా చిరుగాలికి తలలూపే పచ్చని పైర్లూ, పదహారేళ్ళ పడుచు పిల్లలా గలగల మంటూ గెంతులు వేస్తూ కవ్విస్తూ తుళ్ళిపడుతూ సాగిపోయే నదులూ, కాలువలూ, పెద్ద ముత్తైదువులాగా గుంభనంగా ఉండే మామిడి తోటలూ, ఇంక పిల్ల కాయలు కోతి కొమ్మచ్చులు ఆడుకోవటానికే పుట్టినట్లుండే సపోటాలూ, గంపెడు పిల్లలతో నిండుగా నవ్వే తల్లిలాంటి అరటి చెట్లూ, మీకు దాహం వేస్తే తినటానికి ముంజెలు, ఆకలేస్తే తినటానికి తేగలూ, మూడొస్తే తాగటానికి కల్లు, ఎండకీ వానకీ తడవకుండా ఇంటికి పైకప్పు, ఎండాకాలం ఇస్సో ఉస్సో మనుకుంటూ విసురుకోవటానికి విసనకర్రలూ అన్నీ మా సొత్తే కదా అంటూ పలకరించే తాడి చెట్లూ ఇవన్నీ అందాల కోనసీమ సొంతం.